మాలీవుడ్ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్ కి షూటింగ్ లో గాయమైనట్లు తెలుస్తోంది. దర్శకుడు సంతోష్ శివన్ రూపొందిస్తోన్న 'జాక్ అండ్ జిల్' సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

ఈ క్రమంలో మంజూ వారియర్ కింద పడిపోవడంతో ఆమె తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు తలకు 10కి పైగా కుట్లు పడినట్లు తెలుస్తోంది.

దీంతో షూటింగ్ వాయిదా పడింది. మంజూ వారియర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్రబృందం తెలిపింది. ఈ నెల 14న ఆమె మోహన్ లాల్ తో కలిసి నటించిన 'ఓడియన్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.