హీరోయిన్స్ ని హై ప్రొఫైల్ వేశ్యలుగా చూస్తారు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటిగా ఎదగాలనుకునే అమ్మాయిలకు పరిశ్రమలో వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో వివరించారు నటి మిహికా శర్మ.
పరిశ్రమలో హీరోయిన్స్ పై జరిగే లైంగిక వేధింపులు దాడులు గురించి నటి మహికా శర్మ సంచలన కామెంట్స్ చేశారు. పరిశ్రమలో హీరోయిన్స్ పట్ల ఎంతటి నీచపు, ఏహ్యమైన దృష్టిని దర్శక నిర్మాతలు, నటులు కలిగి ఉంటారో ఆమె ఓపెన్ గా మాట్లాడారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటిగా ఎదగాలనుకునే అమ్మాయిలకు వేధింపులు ఈ స్థాయిలో ఉంటాయో వివరించారు.
గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్స్‌ను ఎప్పుడూ లైంగిక వస్తువులుగానే అందరూ చూస్తారు. కొందరు బలవంతం చేస్తే మరికొందరు అవకాశాల ఎరగా వేసి, హీరోయిన్స్ ని తమ వశం చేసుకుంటారు. ఇండస్ర్టీలో నిలదొక్కుకోవాలంటే ఏదో ఒకటి త్యాగం చేయాల్సిందే అని నాతో చాలామంది చెప్పారు. వాళ్లు చెప్పినదానికి ఒప్పుకోకపోతే అవకాశాలు రావు. ఇక జీవితాంతం కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎదగాలని వచ్చిన చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ డైరెక్టర్ లేదా నిర్మాతలకు బలవుతంటారు. వాళ్లు అమ్మాయిలను కేవలం లైంగిక వస్తువులుగానే చూస్తారు.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.సొసైటీ కూడా సినీ ఇండస్ర్టీని చూసే విధానం వేరుగా ఉంటుంది. హీరోయిన్స్ అంటే హై ప్రొఫైల్ ఉన్న వేశ్యలుగానే చూస్తారు. క్రేజ్ తప్పా గౌరవం ఉండదు. ఇది చాలా దారుణమైన విషయం'అంటూ సినీ ఇండస్ట్రీలో వేధింపుల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన మహికా బాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. బుల్లితెరపై రామాయణ, ఎఫ్.ఐ.ఆర్ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందింది. అలాగే పోర్నోగ్రఫీ ఆరోపణలపై అరెస్ట్ కాబడిన రాజ్ కుంద్రా కేసు గురించి ఆమె మాట్లాడుతూ, మాలాంటి నటులకు శిల్పా శెట్టి ఒక స్ఫూర్తి, అలాంటి శిల్పా ఎలాంటి ఆరోపణలపై అరెస్ట్ కావడం, బాధాకరం అంటూ మహికా శర్మ అన్నారు.