పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచనల్ని పసిగట్టడం కష్టం అని సన్నిహితులు అంటుంటారు. తెలుగు అందం లయకి కూడా పవన్ తో అలాంటి అనుభవమే ఎదురైందట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచనల్ని పసిగట్టడం కష్టం అని సన్నిహితులు అంటుంటారు. తెలుగు అందం లయకి కూడా పవన్ తో అలాంటి అనుభవమే ఎదురైందట. హీరోయిన్ లయ పవన్ తో ఎప్పుడూ నటించలేదు. మరి పవన్ కళ్యాణ్ తో జరిగిన సంఘటన ఏంటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళదాం. 

అచ్చతెలుగు అందం లయ స్వయంవరం, మనోహారం, పెళ్ళాంతో పనేంటి, విజయేంద్ర వర్మ లాంటి చిత్రాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. లయ తెలుగు వారందరికీ సుపరిచయమే. ఆ తర్వాత లయ.. గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. త్వరలో లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

తాజాగా ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ.. కెరీర్, పర్సనల్ లైఫ్, పిల్లల, భర్త గురించి అనేక విషయాలు వివరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగా ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. 2006లో లయ వివాహం జరిగింది. తన వివాహానికి లయ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించానని తెలిపింది. కానీ పవన్ కళ్యాణ్ గారితో నాకు పరిచయం లేదు. నేనెవరో కనీసం ఆయనకి తెలుసో లేదో అనే అనుమానంతో ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళా. అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్ళా. 

కానీ ఆయన రిసీవ్ చేసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయా. పెళ్లికి మాత్రం వారి ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు వస్తారని అనుకున్నా. పవన్ వస్తారో లేదో అనే అనుమానం ఉండేది. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా వస్తానని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ అందరికంటే ముందే వచ్చి సర్ప్రైజ్ చేశారు. కనీసం అతిథి మర్యాదలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అన్నయ్య చిరంజీవి గారు కూడా వస్తున్నారు ఆన్ ది వే లో ఉన్నారమ్మా' అని చెప్పడం నా లైఫ్ లో మరచిపోలేని మధురమైన అని లయ గుర్తు చేసుకున్నారు. 

లయ చివరగా రవితేజ అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరిశారు. త్వరలో ఆమె టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తన భర్త డాక్టర్ వృత్తిలో బిజీగా ఉండగా.. తాను డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాను అని లయ పేర్కొంది.