టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారుండరు
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారుండరు. 'స్పైడర్' చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు మహేష్. తెలుగుతో పాటు తన చిత్రాల ద్వారా ఇతర భాషల ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మహేష్ బాబు గురించి తనకు తెలియదని సీనియర్ నటి ఖుష్బూ అనడం ఇప్పుడు వివాదాలకు దారి తీసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ తాజాగా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు ఆమెను ఒక్కో స్టార్ హీరోపై తన అభిప్రాయం అడగగా.. వారిని పొగుడుతూ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమానులు మహేష్ పేరు ప్రస్తావించగా.. ఆమె 'నో ఐడియా' అని బదులిచ్చింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు.
ఇంతలో స్పందించి వెంటనే మహేష్ మంచి మనిషి అని రిప్లయ్ చేసి ట్రోలింగ్ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కొందరు అభిమానులు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పించారు. గతంలో కత్తి మహేష్ కూడా పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు అతడిని ఎంతగా టార్గెట్ చేశారో తెలిసిందే. ఇప్పుడు ఖుష్బూ కూడా మహేష్ గురించి తనకు తెలియదని చెప్పి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మరి ఈ విషయం ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి!
