పూనమ్ పాండే నిజంగా పోయినా బాగుండేది... నటి కస్తూరి ఫైర్
ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే మరణ వార్త సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు తాను చనిపోయినట్లు నాటకం ఆడింది. ఇది పబ్లిసిటీ స్టంట్ అంటున్న కస్తూరి... పూనమ్ పాండే మీద ఫైర్ అయ్యింది.
పూనమ్ పాండే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె మరణ వార్త దర్శనం ఇచ్చింది. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో కన్నుమూసినట్టు సదరు సందేశం సారాంశం. ఇది నిజమని నమ్మిన మీడియా సంస్థలు పూనమ్ పాండే మరణించిందని కథనాలు రాయడమైంది. అయితే ఎక్కడో ఇది ఫేక్ కావచ్చనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఆమెకు నిజంగా క్యాన్సర్ ఉన్నప్పటికీ అప్పటికప్పుడే మరణించడం జరగదని కొందరు అంచనా వేశారు.
తదుపరి రోజు పూనమ్ పాండే ఇంస్టాగ్రామ్ వేదికగా దర్శనం ఇచ్చింది. తాను మరణించలేదని వెల్లడించింది. గర్భాశయ క్యాన్సర్ తో నేను చనిపోలేదు. అయితే చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ తో కన్నుమూస్తున్నారు. అయితే గర్భాశయ క్యాన్సర్ ని నయం చేయవచ్చు అంటూ పూనమ్ పాండే ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన తెచ్చేందుకే చనిపోయినట్లు నాటకం ఆడినట్లు ఆమె పరోక్షంగా వెల్లడించారు. పూనమ్ తీరుపై కొందరు మండిపడుతున్నారు. నటి కస్తూరి సైతం ఆమెను ఏకిపారేసింది. గర్భాశయ క్యాన్సర్ గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలి అనుకుంటే... అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. చనిపోయినట్లు నటించాల్సిన అవసరం లేదు. ఆమె ఆ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేయవచ్చు.
అలా చేసి ఉంటే ఆమెకు పాజిటివ్ పబ్లిసిటీ దక్కేది. ఇంకా నయం తన పబ్లిసిటీ కోసం బ్రెస్ట్ క్యాన్సర్ వాడుకోలేదు. క్యాన్సర్ చిన్న విషయం కాదు. పిడియాట్రిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు నా ఛారిటీ తరపున సహాయం చేస్తున్నాను. అలాంటి నాకు పూనమ్ చేసిన పని చెత్త పుబ్లిసిటీ స్టంట్ మాత్రమే అనిపిస్తుంది. ఆమె సంఘ సంస్కర్త కాదు. పూనమ్ నిజంగా మరణించినా బాగుండేదని సోషల్ మీడియా జనాలు అనుకుంటున్నారు... అని కస్తూరి అన్నారు.