దివంగత నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు తనను మూడేళ్ల పాటు బాయ్‌కాట్ చేశారని అలనాటి నటి జమున చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ విషయంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

ఆడవాళ్లు బయటకొచ్చి ఉద్యోగాలు, కానీ మరేదైనా చేస్తే.. మగవాడు సహించలేడని, వాళ్లకు బానిసల్లా ఉండాలనే కోరుకుంటారని చెప్పింది. బాబు అంటూ దణ్ణం పెట్టించుకోవాలనే తత్వం చాలా మందిలో చాలా ఎక్కువగా ఉంటుందని పరోక్షంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లపై విరుచుకుపడింది.

ఇలాంటి పరిస్థితులని స్త్రీలు ఉద్యోగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఎదుర్కోక తప్పదని, ఇవన్నీ ఎదుర్కోవడానికి స్త్రీలకు చాలా గుండె ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం వలనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఆమెని బాయ్‌కాట్ చేశారంటూ పరోక్షంగా వెల్లడించారు.

ఆ ఇద్దరు హీరోలులేకుండా దాదాపు 18 నుండి 20 సినిమాలు చేశానని, అందులో 15 సినిమాలు హిట్ అంటూ గర్వంగా చెప్పారు. ఆ ఇద్దరు హీరోలు లేకపోయినా జమున మూడో హీరో అంటూ నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి  చూపేవారని తెలిపారు.