మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల రసవత్తపోరు మరికాసేపట్లో మొదలుకానుంది. గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా పోటీ చేసిన శివాజీరాజా, నరేష్ లు ఇప్పుడు ప్రత్యర్దులుగా మారి ప్రెసిడెంట్ పదవి కోసం తలపడుతున్నారు.

ఈ క్రమంలో ఉపాధ్యక్ష పదవికి ఇండిపెండెంట్ అభ్యర్ధినిగా పోటీ చేస్తూ 'మా' ఎన్నికల్లో కీలకంగా మారింది నటి హేమ. గత ఎన్నికల్లో శివాజీ ప్యానెల్ లో ఈసీ మెంబర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తోంది.

గత ఎన్నికల్లో ఈసీ మెంబర్ గా హేమ గెలిచినప్పటికీ తనకు ప్యానెల్ లో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

ఇది ఇలా ఉండగా.. శివాజీరాజా ప్యానెల్ నుండి ఎస్వీ కృష్ణారెడ్డ్, బెనర్జీ.. అలానే నరేష్ ప్యానెల్ నుండి హరనాథబాబు, మాణిక్ లు ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో హేమ ఇండిపెండెంట్ గా ఉపాధ్యక్ష పదవికి పోటీలో నిలవడం హాట్ టాపిక్ గా మారింది.