పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి గౌతమి, బెదిరింపులు వస్తున్నాయంటూ.. ఫిర్యాదు.
తన విలువైన స్థలాన్ని కబ్జా చేశారంటూ.. సీనియర్ నటి గౌతమి పోలీసులను ఆశ్రయించారు. అంతే కాదు తనను బెదిరిస్తున్నారని ఫిలర్యాదు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

సౌత్ సీనియర్ నటి గౌతమి తన స్థలాన్ని కబ్జా చేశారంటూ.. గ్రేటర్ చెన్నై పోలిసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కంచిపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురైందని స్థలాన్ని తన కుమార్తె పేరిట రాసేందుకు గతంలో స్థిరాస్తి వ్యాపారి అళగప్పన్‌ను సంప్రదించగా.. ఆయన తనను మోసం చేశాడని గౌతమి ఫిర్యాదులో వెల్లడించింది.
కంచిపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో తనకు ఒక స్థలం ఉందని ఆ స్థలాన్ని తన కుమార్తె పేరిట రాసేందుకు.. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అళగప్పన్‌ను సంప్రదించామని. అయితే ఆయన ఆ స్థలాన్ని మార్చుతాననిచెప్పి.. తనను మోసం చేశాడని గౌతమి వెల్లడించింది. అళగప్పన్‌తో పాటు అతడి భార్య, మరికొందరు స్థలాన్ని ఆక్రమించుకున్నారని తెలిపింది. అంతేకాదు.. తమ స్థలం గురించి అడిగితే బెదిరించి దాడులకు దిగుతున్నారని.. బెదిరిస్తున్నారని, వారిపై చర్చలు తీసుకోవాలని గౌతమి పోలీసులను కోరింది.
ఇక ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలిసులు నిజా నిజాలపై దర్యాప్తు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన అచ్చతెలుగు హీరోయిన్ గౌతమి. శ్రీకాకులం జిల్లాలో పుట్టిన ఆమె.. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. 80స్.. 90స్.. లో స్టార్ హీరోలతో ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.
ఇక తెలుగు తమిళంలో.. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్, అంబరీష్ లాంటి స్టార్స్ పక్కన ఆడిపాడింది బ్యూటీ. . హీరోయిన్‌గా రిటైర్‌మెంట్ తీసుకున్నాక సెకండ్స్ ఇన్నింగ్స్‌లోనూ తల్లి పాత్రలు చేసుకుంటూ యమ బిజీగా గడుపుతుంది. ఇక గౌతమ్ 1998లో సందీప్ భాటియాను పెళ్లి చేసుకుంది. కానీ ఏడాది తిరక్కుండానే ఆయనతో విడాకులు తీసుకుంది. వీళ్లకి ఒక కూతురు.
పెళ్ళి విడాకుల తరువాత గౌతమి..లోకనాయకుడు కమల్ హాసన్‌తో దాదాపు 5 ఏళ్లు రిలేషన్‌లో ఉంది. ఆతరువాత వీరు కూడా బ్రేకప్ చప్పుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ.. అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ ఉటోంది. తజాగా ఆమె తన స్థలం విషయంలో న్యాయ పోరాటానికి రెడీ అయ్యింది.