బాలీవుడ్ లో ఇటీవల లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగా బయటపడుతున్నాయి. చాలా వరకు నటీమణులు వారికి ఎదురైనా చేదు అనుభవాలు దైర్యంగా చెబుతూ శత్రువులకు చెమటలు పట్టిస్తున్నారు. తను శ్రీ దత్త మ్యాటర్ ఇప్పటికే నేషనల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినీనటి గీతిక త్యాగి వివాదం కూడా వైరల్ గా మారింది. 

ప్రముఖ దర్శకుడి చెంప పగలగొట్టి అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ దర్శకుడు ఎవరో కాదు.  ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’  సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుభాష్ కపూర్. ఒక చేయి లేకపోయినా మంచి ప్రతిభ ఉన్న టెక్నీషియన్ అని బాలీవుడ్ లో సుభాష్ కి పేరుంది. అయితే ఇప్పుడు గీతిక అతనిపై ఆరోపణలు చేయడంతో విమర్శలు వేస్తున్నాయి. 

తనను వేధించాడని ఆమె అతని చెంప పగలగొట్టడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సుభాష్ ను అలాగే అతని భార్యను ఒక స్టూడియోకు రమ్మన్న గీతిక అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిగిన విషయాన్నీ తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె అధికారికంగా వీడియో పోస్ట్ చేస్తూ విషయాన్నీ తెలిపారు. ఘటన కారణంగా సుభాష్ త్వరలో చేయనున్న అమిర్ ఖాన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.