టాలీవుడ్ కుర్ర హీరో రామ్ గురించి నటి ఛార్మి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. రామ్ నటిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు నిర్మాతగా పని చేస్తున్నారు ఛార్మి. 

టాలీవుడ్ కుర్ర హీరో రామ్ గురించి నటి ఛార్మి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. రామ్ నటిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు నిర్మాతగా పని చేస్తున్నారు ఛార్మి. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, షూటింగ్ వేగంగా జరుపుతున్నారు.

తాజాగా ఈ సినిమా సెట్ లో రామ్ ఫోటోని తీసిన ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో రామ్ మాస్క్ ధరించి కనిపించారు.

ఛార్మి తన పోస్ట్ లో.. 'రామ్ చాలా కష్టపడే నటుడు. నీ పాజిటివిటీ, ఎనర్జీ.. నీకు సంబంధించిన ప్రతీది నాకు చాలా నచ్చింది(ఇలా మాట్లాడినందుకు నీ మహిళా అభిమానులు నన్ను చంపకుండా ఉంటారని ఆశిస్తున్నా)'' అంటూ రాసుకొచ్చింది.

పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ మధ్యకాలంలో రామ్ కి సరైన హిట్టు లేదు. పూరి పరిస్థితి కూడా అంతే. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి!

Scroll to load tweet…