500 సినిమాలు చేసిన నటి, ఆర్ధిక సమస్యలు, అనారోగ్యంతో దీన స్థితిలో బిందు ఘోష్ కన్నుమూత

Actress Bindhu Ghosh Passes Away:  బిందు ఘోష్  అంటే ఎవరికి అర్ధం కాదు కాని.. చిత్రం భళరే విచిత్రం సినిమాలో బ్రహ్మానందం జోడీగా నటించిన లేడీ కమెడియన్ గా ఆమె అందరికి గుర్తుండిపోయారు. వందల సినిమాలు చేసిన ఈ నటి అనారోగ్యంతో మరణించింది. 

Actress Bindhu Ghosh of chitram bhalare vichitram Fame Passes Away in telugu jms

Actress Bindhu Ghosh Passes Away:  తమిళ నటి, కొరియోగ్రఫర్, తెలుగులో కూడా భాగా ఫేమస్ అయిన బిధు ఘోష్ కన్నుమూశారు. తమిళంలో   రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, ప్రభు వంటి స్టార్లతో నటించిన ఈ నటి, తెలుగులో బ్రహ్మానందం జోడీగా హిట్ సినిమాలు చేసింది. తెలుగులో వీరి కాంబినేషన్ కు  మంచి పేరుంది. దాాదాపు 500 సినిమాల వరకూ నటించిన ఈ సీనియర్ నటి, ఆర్ధిక సమస్యలు, అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరం. రీసెంట్ గా ఓ చిన్న ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో అన్నీ పోగోట్టుకున్నామన్నారు. ఇల్లు వాకిలి, డబ్బు, బంగారం అన్నీ పోయాయన్నారు.

విమల ఆమె రియల్ నేమ్ కాగా.. బిందు ఘోష్ స్క్రీన్ నేమ్. 1982లో వచ్చిన తమిళ  సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమా తర్వాత ఉరువంగల్ మారలామ్, డౌరీ కళ్యాణం, సూరక్కోట్టై సింగకుట్టి, తూంగాదే తంబి తూంగాదే అని చాలా సినిమాల్లో నటించారు. తమిళ సినిమాలో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. చివరగా 1992లో వచ్చిన తెలుగు సినిమాలో నటించారు. ఆతరువాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు. 

సినిమాల్లో నటిస్తూనే సన్యాసిలా బతికిన వ్యక్తి బిందు ఘోష్. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. దీనివల్ల తను కూడబెట్టిన ఆస్తులన్నీ పోగొట్టుకుని అద్దె ఇంట్లో ఉన్నారు. దీంతో ఆరోగ్యం కూడా పాడైపోయింది. వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేక చాలా ఇబ్బంది పడ్డారు. బిందు ఘోష్‌కు ఇద్దరు కొడుకులు. అందులో ఒకరు తను  చూసుకోలేనని చెప్పి వెళ్లిపోయాడు. రెండో కొడుకు దగ్గరే బిందు ఘోష్ ఉంటూ వచ్చింది. అయినా ఇంటి అద్దె, వైద్య ఖర్చులు అని చాలా కష్టపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే కొద్దిరోజుల కిందట నటి షకీలా సహాయంతో KPY బాలా బిందు ఘోష్‌ను కలిసి 80 వేలు ఇచ్చి సహాయం చేశారు. అంతకుముందు నటుడు విశాల్ తో సహా చాలామంది సినీ ప్రముఖులు సహాయం చేస్తూ ఉండగా ఇవాళ మధ్యాహ్నం చనిపోయారు. ఆమె వయసు 76. సినిమాల్లో నటిస్తున్నప్పుడు 1000 నుంచి 3000 వరకు జీతం తీసుకునేవారు.

సినిమా ద్వారా వచ్చిన డబ్బుతోనే సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నారు. కుటుంబ సమస్యల వల్ల తనతో ఉన్నవాళ్లు తనని వదిలి వెళ్లిపోయారు. దీంతో ఎవరూ లేనప్పుడు ఇల్లు అమ్మి అద్దె ఇంట్లో ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లోనే ఆరోగ్యం బాగా లేక చనిపోయారు. ఆమె మృతికి సినీ ప్రముఖులు  సంతాపం తెలుపుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios