మరింత అందం కోసం ప్రయత్నం, వికటించిన సర్జరీ.. రక్తం గడ్డకట్టి నటి మృతి

సినిమా అనే రంగుల ప్రపంచంలోకి నటీమణులు ఊహల్లో తేలిపోతూ వస్తారు. కానీ విజయం సాధించేది కొందరు మాత్రమే. చాలా మంది నటీమణులు తాము ఎంత అందగత్తెలు అయినప్పటికీ.. మరింత హాట్ గా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకోవడం చూస్తూనే ఉన్నాం.

actress beauty queen Jacqueline Carrieri dies due to surgery dtr

సినిమా అనే రంగుల ప్రపంచంలోకి నటీమణులు ఊహల్లో తేలిపోతూ వస్తారు. కానీ విజయం సాధించేది కొందరు మాత్రమే. చాలా మంది నటీమణులు తాము ఎంత అందగత్తెలు అయినప్పటికీ.. మరింత హాట్ గా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకోవడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి, జాన్వీ కపూర్ లాంటి అందాల భామలు సర్జరీ చేయించుకుని అందం పెంచుకున్నారు. 

అయితే ఈ సర్జరీ అందరికి కలసి రావడం లేదు. అయేషా టాకియా సర్జరీ తర్వాత ఆమె ముఖం విచిత్రంగా మారింది. హీరోయిన్ ఆర్తి అగర్వాల్, కన్నడ నటి చేతనా రాజ్ లాంటి వారు సర్జరీ వికటించడంతో మృతి చెందారు. దీనితో అందానికి సర్జరీ అనేది అంత తేలికైన విషయం కాదని తెలిసిపోయింది. తాజాగా మరో సీనియర్ నటి సర్జరీ వికటించడంతో మరణించిన విషాదక సంఘటన చోటు చేసుకుంది. 

అర్జెంటీనాకి చెందిన నటి జాక్వెలిన్ కరీరి మరింత అందం కోసం సర్జరీ చేయించుకోవాలనుకుంది. కానీ సర్జరీ జరుగుతున్న సమయంలోనే తన శరీరంలో రక్తం గడ్డ కట్టడంతో ఆమె మరణించినట్లు తాజాగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. అక్టోబర్ 1న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జాక్వెలిన్ కరీరి మాజీ అందాల సుందరి. ఆమె అనేక బ్యూటీ పేజెంట్ ఈవెంట్స్ లో విజేతగా నిలిచింది. కొన్నిటిలో రన్నరప్ గా నిలిచింది. కానీ మరోసారి మరింత అందం కోసం ప్రయత్నించడం శాపంగా మారింది. సర్జరీ పూర్తిగా వికటించడంతో ఆమె బాడీలో రక్తం గూడు కట్టి అకస్మాత్తుగా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. ఆమె వయసు 48 ఏళ్ళు. ఆమెకి చోలే, జులియన్ ఇద్దరు పిల్లలు సంతానం. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించిన జాక్వెలిన్ కరీరి మరణించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios