నేను కూడా అలా చేయడానికి రెడీ

actress apoorva to observe indefinite fast
Highlights

నేను కూడా అలా చేయడానికి రెడీ

మొదటి నుంచి శ్రీరెడ్డికి మద్దతుగా ఉన్న మరోనటి అపూర్వ. ‘సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్’ అంశంపై  హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా అపూర్వ మాట్లాడుతూ, న్యాయం  జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే, ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తామని హెచ్చరించింది. 

ఉన్నది ఉన్నట్టుగా తాము మాట్లాడుతుంటే, కొందరు తమను అవహేళన చేస్తున్నారని, తమకు మద్దతుగా నిలవకపోయినా పర్వలేదుగానీ, అనవసర వ్యాఖ్యలు చేయొద్దని కోరింది. కాగా, సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక హింసను కూడా ఆమె ప్రస్తావించింది.

loader