సినీ తారలు సాధ్యమైనంత ఎక్కువ కాలం గ్లామర్ గా కనిపించేందుకు ఇష్టపడతారు. నటీమణులు గ్లామర్, లుక్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటుంటారు. ఎంత ప్రయత్నించినా 40 ఏళ్ల వయసు వచ్చాక యంగ్ ఏజ్ లో ఉన్నత మెరుపు వారిలో కనిపించదు. వయసు ఇట్టే తెలిసిపోతుంది.  కానీ ఆ విషయంలో ఈ తైవాన్ బ్యూటీ నిజంగా అద్భుతం. 

సియావో అనే నటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హిట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఆమె వన్నె తరగని అందమే. ఈ బ్యూటీని చూసినవారెవరైనా 20 నుంచి 25ఏళ్ల వయసు ఉండే యంగ్ హీరోయిన్ అని భ్రమ పడతారు. ఈ విషయంలో సియావో నెటిజన్లకు అంతు చిక్కడం లేదు. ఆమె అసలు వయసు 51 ఏళ్ళు. 1989లో నటిగా తన కెరీర్ ని ప్రారంభించింది. టివి నటిగా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం సియావో రొమాంటిక్ డ్రామా అనే సీరియల్ లో నటిస్తోంది. 

సియావో గ్లామర్ సీక్రెట్ ఏంటని అంతా తలలు పట్టుకుంటుండగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కొన్ని దశాబ్దాలుగా తాను క్రమం తప్పకుండా యోగా చేస్తున్నానని సియావో తెలిపింది. జంతు ప్రేమికురాలిని. ఒత్తిడి, చిరాకు లాంటి విషయాలని దరిచేరనీయను. శాకాహారం మాత్రమే తీసుకుంటాను. ప్రతి రోజు స్విమ్మింగ్ చేస్తాను అంటూ సియావో తన గ్లామర్ సీక్రెట్ బయటపెట్టింది. సియావో గ్లామర్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.