కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. నటీనటులు, రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల.. తెలుగు బుల్లితెర నటి నవ్య స్వామి కరోనా బారిన పడగా.. తాజాగా.. మరో టీవీ సీరియల్ నటి ని కరోనా కాటు వేసింది.

హిందీ టీవీ నటి అదితి గుప్తా కరోనా బారిన పడ్డారు. పలు టెలివిజన్ సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అదితి స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న పాపులర్ షో ఇష్క్ బాజ్ లో ఉన్నారు. తనకు కరోనా వచ్చిన విషయాన్ని ఇన్ స్టాలో తెలియజేశారు.

 కరోనా సోకిందని తెలియగానే హోం క్వారంటైన్ లోకి వెళ్లానని భర్త, కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతున్నారని అన్నారు. తగిన ఔషధాలు తీసుకుంటూ పాజిటివ్ ధోరణితో ఉంటున్నానని, తర్వలోనే కోలుకుంటానని తెలిపారు.

ఆమె వాసన గ్రహించే శక్తిని కోల్పోయింది. దీంతో.. అనుమానంతో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. వైద్యుల సలహాతో ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది.


వాసన పసిగట్టలేనట్టు గుర్తించిన వెంటనే తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని.. టెస్ట్ చేయించుకున్నానని అదితి చెప్పింది. దాదాపు ఏడుఎనిమిది రోజుల నుంచి తాను ఒక రూమ్‌కే పరిమితమయినట్లు ఆమె తెలిపింది. మరో 10 రోజులకు పైగా చికిత్స తీసుకుంటూ, సరైన ఆహారం తింటూ క్వారంటైన్‌లోనే ఉండనున్నట్లు చెప్పింది.