హీరో వేణు నటించిన చెప్పవే చిరుగాలి చిత్రంలో హీరోయిన్ గా నటించిన అభిరామి గుర్తుందా.. క్యూట్ లుక్స్ తో లాడ్జి ఓనర్ కూతురిగా అభిరామి ఆ చిత్రంలో హోమ్లీగా నటించింది.
హీరో వేణు నటించిన చెప్పవే చిరుగాలి చిత్రంలో హీరోయిన్ గా నటించిన అభిరామి గుర్తుందా.. క్యూట్ లుక్స్ తో లాడ్జి ఓనర్ కూతురిగా అభిరామి ఆ చిత్రంలో హోమ్లీగా నటించింది. కేరళకు చెందిన ఈ భామ సౌత్ లో అన్ని భాషల్లోనూ నటించి మెప్పించింది. అయితే ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేదు.
2009 లోనే అభిరామి.. రాహుల్ పవనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సెటిల్ అయింది. పెళ్ళైన 14 ఏళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని తాజాగా అభిరామి సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. కాకపోతే చిన్న ట్విస్ట్. ఆభిరామి, రాహుల్ దంపతులకు పిల్లలు లేరు. దీనితో వీరు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం మదర్స్ డే రోజున అభిరామి, రాహుల్ ఓ ఆడబిడ్డని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు అయ్యారు. కల్కి అనే పాపని వీరు దత్తత తీసుకున్నారు. గత ఏడాదే దత్తత తీసుకోవడం జరిగిందట. ఈ ఏడాది తొలి మదర్స్ డే జరుపుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో అభిరామి పంచుకుంది.
'డియర్ ఫ్రెండ్స్.. రాహుల్, నేను ఇప్పుడు ఓ ఆడబిడ్డకు తల్లిదండ్రులం అని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. మా కూతుర్ని మేము గత ఏడాది దత్తత తీసుకున్నాం. మా జీవితంలో ఇది కొత్త మలుపు. ఈ మదర్స్ డే సందర్భంగా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అని అభిరామి పోస్ట్ చేసింది.
పాప ముఖం చూపించకుండా ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. తెలుగులో అభిరామి చెప్పవే చిరుగాలి చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. థాంక్యూ సుబ్బారావు, చార్మినార్, అమర్ అక్బర్ ఆంటోని లాంటి ఇతర చిత్రాల్లో కూడానా అభిరామి నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అభిరామి కీలక పాత్రల్లో నటిస్తోంది. మదర్స్ డే రోజున అభిరామి గుడ్ న్యూస్ చెప్పడంతో నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
