తన గ్యారేజ్ లో ఉన్న అతి ఖరీధైన బైక్స్ ను అన్నింటికి అమ్మేశాడట.. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ. దానికి కారణం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అని చెపుతున్నాడు.. అదెలా..?  

మెగా మేనల్లుడు.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ మంచి ఫ్రెండ్స్.. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వీరిద్దరు కలిసి బైక్ రైడ్స్ కు వెళ్ళడం.. కలిసి డిన్నర్లు.. టూర్లు ఇలా చాలా క్లోజ్ గా ఉంటారు. ఆల్ మోస్ట్ ప్రతీ రోజు ఇద్దరు బైక్ రైడ్ కు వెళ్తుంటారట. నవీన్ నవీన్ దగ్గర మంచి మంచి బైక్ కలెక్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి బైక్ పై ఎవరికి కనబడకుండా చక్కర్లు కొడుతుంటారు. దీంతో యాక్సిడెంట్ సమయంలో ఇద్దరు కలిసి రేసింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై నవీన్ సమాధానం ఇచ్చాడు.

అయితే ఆమధ్యసాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే. రోడ్డుపై ఇసుకు వల్ల ప్రమాదానికి గురయ్యి.. కోమా స్టేజి వరకు వెళ్లి కోలుకొని తిరిగి వచ్చాడు. ఆ ప్రమాదంతో మెగా ఫ్యామిలీ చాలా భయపడిపోయింది. మెగాభిమానులు షాక్ అయ్యారు. తన బాధను రీసెంట్ గా బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకున్నాడు సాయి. అంతే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు. 

అయితే ఆ యాక్సిడెంట్ కు కారణం సాయి ధరమ్ తేజ్ ఫ్రెండ్ నవీన్ అంటూ.. కొన్ని వార్తలు పుకార్లు షికారు చేశాయి. ఆ విషయం తనను ఎంతో బాధించింది అన్నారు నవీన్. ప్రతీ రోజు కలిసి బైక్ రైడ్ కు వెళ్తుంటామ్.. అయితే రోజు సాయి తేజ్ ను తన ఇంటిదగ్గర దిగబెట్టిన తరువాతే తాను ఇంటికి వెళ్తాను. కాని ఆరోజు.. తేజ్ నేను వెళ్తాను అన్నాడు. ఇల్లు దగ్గరేకా.. వెళ్తాను లే అనడంతో..నేను ఇంట్లోకి వెళ్లాను. కాని ఆతరువాత ఈ వార్త వినడం నన్ను కలిచివేసింది. ఆరోజు హాస్పిటల్ కు వెళ్ళి సాయి తేజ్ ను అలా చూడలేకపోయాను అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు నవీన్ విజయ్ కృష్ణ. 

నేను ఆ బాధలో ఉండగా మీడియాలో నన్ను కారణంగా చూపిస్తూ.. కొన్ని వార్తలు రావడం ఇంకా బాధని కలిగించినట్లు చెప్పుకొచ్చాడు. తేజ్ పరిస్థితి చూసిన నవీన్ ఒక నిర్ణయం తీసుకోని.. తన షెడ్‌లో ఉన్న బైక్స్ అన్ని అమ్మేశాడట. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రో మూవీకి ఎటిటర్ గా పనిచేశాడు నవీన్. హీరోగా కెరీర్ ను వదిలేసి.. టెక్నీషియన్ గా కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం తేజ్ హీరోగా నవీన్ దర్శకత్వంలో తెరకెక్కిన సత్య అనే ఫీచర్ ఫిలింతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.