Asianet News TeluguAsianet News Telugu

లేడీ డైరెక్టర్ తో Yash19 ఫిక్స్.! డిసెంబర్ నుంచే షూటింగ్.?

కన్నడ స్టార్ యష్ తదుపరి చిత్రంపై అదిరిపోయే అప్డేట్ అందింది. ఈ ఏడాదే భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఈమేరకు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. డిటెయిల్స్ ఇంట్రెస్టింగా ఉన్నాయి. 
 

Actor Yash 19 film confirmed with Lady Director  Geethu Mohandas? NSK
Author
First Published Sep 12, 2023, 7:12 PM IST | Last Updated Sep 12, 2023, 7:17 PM IST

కన్నడ స్టార్ హీరో యష్ (Yash)  ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్ గా  గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1 మరియు 2తో రాఖీబాయ్ గా యష్ సృష్టించిన సెన్సేషన్ కు బాక్పాఫీస్ షేక్ అయిన విషయం తెలిసిందే. పార్ట్ 2 రూ.1200 కోట్ల వరకు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాత యష్ నటించబోయే తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. 

Yash19  అనౌన్స్ మెంట్ గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆ మధ్యలో మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ‘యష్19’ను డైరెక్ట్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే బజ్ మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. గీతూ మోహన్ దాస్ పేరు బలంగా వినిపించడంతో పాటు వీరి కాంబో ఫైనల్ అయ్యిందని అంటున్నారు. రెండేళ్ల పాటు ఎలాంటి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయని యష్ గీతూకే ఛాన్స్ ఇచ్చారని, చాలా మంది డైరెక్టర్ల నుంచి కథలు విన్నా ఫైనల్ చేయలేదంట. చివరిగా గీతూ - యష్ కాంబో ఫిక్స్ అయ్యిందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

అంతే, కాదు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరిదశలో ఉందని, డిసెంబర్ ప్రారంభం నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారంట. త్వరలో లుక్ టెస్ట్ కూడా జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని కూడా భారీ స్కేల్లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ మున్ముందు అందనున్నాయి. ప్రస్తుతం యష్ ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. 

ఇక గీతూ మోహన్ దాస్ మలయాళంలో తెరకెక్కించిన రెండు చిత్రాలు స్టేట్ అవార్డ్స్ తో పాటు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఈ క్రమంలో యష్ సినిమాను నెక్ట్స్ లెవల్లో డిజైన్ చేసి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Actor Yash 19 film confirmed with Lady Director  Geethu Mohandas? NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios