ఆదిపురుష్ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తనకు ఇష్టం వచ్చినట్లు తీశాడు. ఎవరు చెప్పినా వినలేదంటూ విందు దారా సింగ్ కీలక ఆరోపణలు చేశాడు.  

దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ తెరకెక్కించగా అత్యంత వివాదాస్పదం అయ్యింది. రామాయణాన్ని వక్రీకరించాడని పలువురు మండిపడ్డారు. ఆదిపురుష్ మూవీలో ప్రధాన పాత్రల గెటప్స్ సైతం విమర్శల పాలయ్యాయి. ముఖ్యంగా రావణాసురుడి లుక్ హాలీవుడ్ చిత్రాల్లో విలన్ మాదిరి ఉంది. అలాగే బ్రాహ్మణుడైన రావణాసురుడు తన వాహనానికి మాసం ఆహారంగా పెట్టడాన్ని తప్పుబట్టారు. కొన్ని, సీన్స్ డైలాగ్స్ కూడా చర్చకు దారి తీశాయి. 

ఇక గ్రాఫిక్స్ అయితే దారుణం. ఆరు వందల కోట్ల బడ్జెట్ తో కార్టూన్ మూవీ తీశాడంటూ దుయ్యబట్టారు. దర్శకుడు ఓం రౌత్ తో పాటు ప్రభాస్ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరిని పడితే వాళ్ళను రాముడుగా జనాలు అంగీకరించరు అని కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి అభిప్రాయ చురకలు వేశారు. కాగా ఆదిపురుష్ ఫెయిల్యూర్ పై బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ ఓపెన్ అయ్యారు. ఆయన ఓం రౌత్ ని ఉద్దేశించి కీలక ఆరోపణలు చేశాడు. 

విందు దారా సింగ్ మాట్లాడుతూ... ఆదిపురుష్ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చమని నటులు ఓం రౌత్ కి సూచించారు. కొన్ని డైలాగ్స్ పలకడానికి రావడం లేదు. సౌకర్యంగా లేవు. సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారని హెచ్చరించారు. ఎవరి మాటా వినకుండా ఓం రౌత్ తాను అనుకున్నట్లే ఆదిపురుష్ తెరకెక్కించాడు. ఆదిపురుష్ మూవీ వలన ప్రభాస్ కి చెడ్డ పేరు వచ్చింది. ఆదిపురుష్ ఫెయిల్యూర్ కి ఓం రౌత్ మొత్తంగా కారణం అయ్యాడని... అన్నారు. 

ప్రముఖ నటుడు దారా సింగ్ తనయుడే ఈ విందు దారా సింగ్. బుల్లితెర మీద ప్రసారం అయిన రామాయణం సీరియల్ లో దారా సింగ్ హనుమంతుడు పాత్ర చేశాడు. ఆయన కుమారుడు విందు దారా సింగ్ పలు సీరియల్స్, సినిమాల్లో నటించాడు. గత ఏడాది విడుదలైన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయ్యింది. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ తో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుత విజువల్స్ ఇచ్చాడని ఓం రౌత్ ని సోషల్ మీడియాలో ఏకి పారేశారు...