ఈమధ్య కొంత మంది సెలబ్రిటీల నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది. సమాజంతో సంబంధం లేదు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. రీసెంట్ గా ఓ మలయాళ నటుడు మాట్లాడిన మాటలు దుమారాన్ని రేపుతున్నాయి. 

ఈమధ్య కొంత మంది సెలబ్రిటీల నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది. సమాజంతో సంబంధం లేదు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. రీసెంట్ గా ఓ మలయాళ నటుడు మాట్లాడిన మాటలు దుమారాన్ని రేపుతున్నాయి. 

మలయాళ నటుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వినాయకన్‌ మీ టూపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. తను 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ వినాయకన్‌ వెల్లడించారు. తన కొత్త సినిమా ఒరుతె ప్రమోషన్‌ ఈవెంట్ లో ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు వినాయకన్. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో మీ టూ ఆరోపణలు పై వినాయకన్‌ కు మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా.. అతడు స్పందించిన తీరు అందరిని షాక్ కు గురిచేసింది. వినాయకన్ చేసిన ఈ వాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు సైతం వినాయకన్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఒరుతె ప్రమోషన్‌ కార్యక్రమంలో వినాయకన్‌తో పాటు మూవీ టీం సందడి చేసింది. ఈ టైమ్ లో వినాయకన్ మాటలకు అందరూ షాక్ అయ్యారు. ఈ సందర్భంగా మీ టూ ఉద్యమంపై ఆయన అభిప్రాయం అడగ్గా.. మీటూ అంటే తనకు తెలియదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మీ టూ ఉద్యమం అంటే ఏమిటో తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే. నేను దానిని అలాగే కొనసాగిస్తాను అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. 

అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా ఇది కేవలం మహిళలకు సంబంధించిన విషయమేనా? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ.. రివర్స్ క్వశ్చన్ వేశార వినాయకన్‌. అంతే కాదు ఇదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానని, వారందరిని నాతో గడుపుతారా? అని అడిగానని చెప్పాడు. ఈ మలయాళ నటుడు ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీశాయి.