నటుడు విమల్ మద్యం సేవించి మరో నటుడిపై దాడికి దిగడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరుకి చెందిన అభిషేక్ అనే వర్ధమాన నటుడు స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తున్నాడు. 'అవన్ ఇవల్ ఆదు' అనే చిత్రంలో నటించాడు అభిషేక్.

అయితే శనివారం రాత్రి అభిషేక్ తను నివసిస్తున్న అపార్ట్మెంట్ పైభాగంలో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఆ సమయంలో నటుడు విమల్ తో సహా నలుగురు అనుచరులు అక్కడికి వచ్చి కాసేపు ఇక్కడ కూర్చోవచ్చా అని అభిషేక్ ని అడిగారు.

దానికి ఆయన తను ఇంటి యజమానిని కాదని,కాబట్టి తనకు సంబంధం లేదని సమాధానం చెప్పాడు. దీంతో విమల్.. అభిషేక్ తో గొడవకి దిగాడు. అప్పటికే విమల్ మద్యంసేవించి ఉండడంతో గొడవ మరింత పెద్దదైంది. విమల్ తన అనుచరులతో కలిసి అభిషేక్ పై దాడికి దిగాడు.

దీంతో అతడికి గాయాలయ్యాయి. వడపళనిని ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడుఅభిషేక్. ఆ తరువాత విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ లో విమల్ పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.