విలక్షణ నటుడు విజయ్ సేతుపతి జాతీయ అవార్డుకొల్లగొట్టారు. 2019 జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ సహాయనటుడిగా విజయ్ సేతుపతి అవార్డు పొందారు. 67వ జాతీయ అవార్డ్స్ సోమవారం భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఉత్తమ నటుడుగా అసురన్ చిత్రానికి గాను ధనుష్ ఎంపికయ్యారు. అలాగే మనోజ్ బాజ్ పేయ్, ధనుష్ లను కలిపి  సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక చేశారు.


ఇక ఉత్తమ నటిగా కంగనా రనౌత్ ఎంపికయ్యారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా మణికర్ణిక చిత్రంలోని నటనకు గాను కంగనాను జాతీయ అవార్డు వరించింది. కాగా జాతీయ ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి ఎంపికయ్యారు. 2019లో విడుదలైన సూపర్ డీలక్స్ చిత్రంలోని నటనకు గాను విజయ్ ఈ అవార్డు గెలుచుకున్నారు. 


దర్శకుడు త్యాగరాజ కుమారరాజా తెరకెక్కించిన సూపర్ డీలక్స్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో అద్భుత నటన కనబరిచారు. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించడం విశేషం. గొప్ప నటుడిగా ఇప్పటికే నిరూపించుకున్న విజయ్ సేతుపతి, జాతీయ అవార్డుకి ఎంపిక కావడంతో, చిత్ర ప్రముఖులు, ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెష్ తెలియజేస్తున్నారు.