ప్రముఖ మలయాళ నటుడు, ఫోరెన్సిక్ ఫేమ్ టోవినో థామస్‌ తీవ్ర గాయాలతో  హాస్పటిల్ లో చేరారు. మళయాళ చిత్రం 'కాలా’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగింది. ఆ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సీన్‌ షూట్ చేస్తూండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ థామస్‌కు ఇంటర్నల్‌ బ్లీడింగ్ కావటంతో ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఆయనకు కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని కడుపులో బలంగా దెబ్బ తగలటంతో ఇంటర్నల్‌ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. టోవినో థామస్‌కు ప్రమాదం జరిగిన వార్త వైరల్ కావడంతో.. ఆయనకు అభిమానులు సోషల్‌ మీడియా వేదిక త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

కాగా, టోవినో థామస్‌కు మాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా ఎంతో గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల థామస్ నటించి ‘ఫోరెన్సిక్’ సినిమా తెలుగులోనూ ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.