సాయి ధరం తేజ్ హీరోగా నటించిన 'చిత్రలహరి' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో సునీల్ నటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. 

ఇప్పుడున్నంత టెక్నాలజీ ఒకప్పుడు లేదని, తాను ఎవరినీ ఏడిపించి బతకడం లేదని, నవ్వించి సంపాదించుకుంతున్నానని చెప్పారు. రీసెంట్ ఒకరు తను చనిపోయినట్లు యూట్యూబ్ లో వీడియో పెట్టారని.. దానివల్ల సదరు ఛానెల్ కి మిలియన్ వ్యూస్ వచ్చాయని చెప్పాడు సునీల్.

దీంతో పోలీసులకు కంప్లైంట్ చేయగా.. ఛానెల్ యజమాని తప్పైపోయిందని క్షమించమని కోరినట్లు చెప్పాడు. మిలియన్ వ్యూస్ కోసం ఒకరిని చంపేయాలా..? వాళ్ల ఇంట్లో వాళ్లను చంపితే అప్పుడు ఆ బాధేంటో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ న్యూస్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయిస్తే నాకు మాత్రం ఏమోస్తుందని వదిలేసినట్లు చెప్పాడు సునీల్. 

''మనం ఫెయిల్ అయితే మనల్ని హర్ట్ చేసేవారే ఎక్కువ. సక్సెస్ అయితే పొగిడేవారు ఎక్కువ అవుతారు. మనల్ని మనం పవర్ ఫుల్ అనుకోకపోతే  బ్రతకలేం. కానీ ఎప్పటికీ మన చుట్టూ ఉన్న సిట్యుయేషనే పవర్ ఫుల్. అదే మన అవసరాలను నిర్ణయిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చారు.