యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘భళా తందనాన’. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మూవీ రిలీజ్ కు సిద్ధమవడంతో మేకర్స్ తాజాగా విడుదల తేదీని ఫైనల్ చేశారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. కానీ సరైన బ్రేక్ పడటం లేదు. దీంతో హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు యంగ్ స్టార్ శ్రీవిష్ణు (Sree Vishnu). ఎన్ని సినిమాలు చేసినా.. అవి ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోతున్నాయి. కాని పెర్ఫామెన్స్ పరంగా మాత్రం విష్ణుకి మంచి మార్కులు పడుతున్నాయి. శ్రీవిష్ణు హీరోగా.. చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘భళా తందనాన’(Bhala Thandanana). వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో, శ్రీవిష్ణు జోడీగా కేథరిన్ నటించింది. శ్రీకాంత్ విస్సా కథను అందించిన ఈ సినిమాకి మణిశర్మ అద్భుతంగా మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా పోస్టర్లు, టీజర్, మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ అందించారు. ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో శ్రీ విష్ణు అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో కేజీఎఫ్ (Kgf1) ఫేమ్ రామచంద్రరాజు విలన్ గా నటిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. రిలీజ్ డేల్ ఫైనల్ చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రీవిణు, రామచంద్రరాజు తలపడుతున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో శ్రీవిష్ణు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
వారాహి బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సత్య, శ్రీనివాస్ రెడ్డి, పోనాని , ఆదర్శ్ బాలక్రిష్ణ పలు కీలక పాత్రల్లో నటించనున్నాయి. శ్రీవిష్ణు కు జోడిగా కేథరిన్ థ్రెసా (Catherine Tresa) నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ట్రెండీ మ్యూజిక్ అందిస్తున్నారు.
