ప్రముఖ తెలుగు యాంకర్ వింధ్యా విశాఖపై నటుడు సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించాడు.  వింధ్య అసలు సిసలైన రాక్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని వింధ్య స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో అభిమానులతో పంచుకున్నారు.

వింద్యకు సోనూసూద్ పంపిన స్పెషల్ వీడియోని ఆమె షేర్ చేశారు. ఆ వీడియోలో సోనూసూద్ మాట్లాడుతూ.. ‘ హాయ్ వింద్య.. మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ అనే పదం సరిపోదు. సోనూసూద్ ఫౌండేషన్ పై విశ్వాసం ఉంచినందుకు దన్యవాదాలు. మీరు నిజమైన రాక్ స్టార్. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వు వెలిగిస్తుంది. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. టేక్ కేర్’ అని చెప్పారు.

మరి ఇంతలా సోనూసూద్ మనసు గెలిచిందంటే.. వింద్య ఏం చేసి ఉంటుందనే కదా మీ అనుమానం. మ్యాటరేంటంటే... కరోనా సమయంలో సోనూసూద్ ఎంతో మంది పేదలను ఆదుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కరోనా టైంలో ఆయన ఓ సూపర్ హీరో అయిపోయారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరిట విరాళాలు సేకరిస్తూ.. వాటిని పేదలకు వినియోగిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు యాంకర్ వింధ్యా విశాఖ తన వందు సాయంగా సోనూసూద్ ఫౌండేషన్ కు విరాళం ఇచ్చారు. తన కాస్టూమ్స్ ని వేలం వేసి.. వచ్చిన డబ్బు మొత్తాన్ని సోనూసూద్ ఫౌండేషన్ కు పంపించారు. దీంతో.. ఆమె చేసిన పనికి సోనూసూద్ ప్రశంసలు కురిపించారు.

కాగా.. వింధ్య పలు టీవీషోలోకు వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఐపీఎల్, ప్రోకబడ్డీ లీగ్ లకు కూడా ఆమె ప్రజెంటేటర్ గా వ్యహరించారు. కాగా.. సోనూసూద్ స్వయంగా తనకు వీడియో పంపడంతో ఆమె చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.