తన అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాడు.. రియల్ హీరో సోనూసూద్. దయచేసి అభియాను తన గురించి పెద్ద పెద్ద పనులు చేయవద్దు అన్నారు.
రీల్ విలన్.. రియల్ హీర్ సోనూ సూద్ తన అభిమానులకు ఓ విన్నపం చేశాడు. తనకోసం విగ్రహాలు పెట్టడం, గుడు కట్టడం లాంటివి ఆపాలని..వాటి బదులుగా హాస్పిటల్స్ కాని..స్కూల్స్ కాని నిర్మించే కార్యక్రమాలు చేయాలంటూ అభిమానలుకు విన్నవించాడు సోనూ. తనకు గుడికట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదని.. కాని స్కూల్స్.. హాస్పిటల్స్ కట్టడంవల్ల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
రీసెంట్ గా సిద్ధిపేట దగ్గర ఉన్న ఓ తండాలో కూడా సోనూసూద్ కు గుడిని నిర్మించారు. అది గతంలోనే నిర్మించినదైనా తాజాగా సోనూసూద్ సిద్దిపేట వచ్చారు. ఈ గుడిని చూసి, ఇక్కడి ప్రజలతో, మీడియాతో మాట్లాడారు. సోనూసూద్ మాట్లాడుతూ.. నేను చేయగలిగినంత చేసే ఓ సామాన్యుడిని. ఇలా గుళ్ళు కట్టడం, పూజలు చేయటం లాంటివి చేయకూడదు అనే అనుకుంటాను. వారు నా మీద ప్రేమతో చేశారని నాకు తెలుసు. కానీ ఇకపై అలా చేయవద్దని నా అభిమానులకి చెప్తున్నాను అన్నారు.
నాకు గుడి కట్టే బదులుగా.. స్కూల్ కాని హాస్పిటల్ కానీ కట్టమని చెప్తున్నాను అని అన్నారాయన. ఈ మాటలతో మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు సోనూసూద్. తెలిపాడు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో వేలమందిని ఆదుకున్నాడు సోనూసూద్. ఎంతో మందికి జీవితం ఇచ్చాడు. ఆ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలని ఆపలేదు సోనూ. రియల్ హీరో అనిపించరకున్నాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి రకరకాలుగా సాయం అందించాడు. అంతే కాదు బాగా చదువుకుని ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నవారిని సొంత ఖర్చులతో చదివిస్తున్నాడు సోనూసూద్.
ఇప్పటికే ఎంతో మందికి బ్రతుకుతెదరు చూపించాడు సోనూ. చదువలులేనివారికి చదువు చెప్పడంతో పాటు.. చదువుకుని జాబ్ లేక ఇబ్బంది పడుతున్నవారికి ఉద్యోగాలు ఇప్పించడం, బ్రతుకు తెరువు చూపించడం.. లాంటి పనులు ఇంకా చేస్తూనే ఉన్నాడు. దాంతో సినిమాల్లో విలన్ గా ఉన్న ఆయన.. రియల్ లైఫ్ లో రియల్ హీరో అయిపోయాదు. ఆయన చేసిన సాయానికి గుండెల్లో గుడికట్టిన వారితో పాటు.. రియల్ గా గుడి కట్టినవారు కూడా ఉన్నారు. చాలా మంది వారి పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకోగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇండియాలో చాలా చోట్ల ఆయనకు గుడి కూడా కట్టారు.
