ఎంత గొప్పవారికైనా వ్యసనాల నుండి బయటపడడం అంత సులభమైన విషయం కాదు. దేశం మెచ్చిన స్టార్ గా ఎదిగిన రజినీ కాంత్ కూడా మద్యం, పొగతాగడం వంటి వ్యసనాల నుండి బయటపడలేక పోయారట. ఓ సందర్భంలో ఈ విషయాన్ని స్వయంగా రజినీ కాంత్ తెలియజేశారు. కెరీర్ బిగినింగ్ లో రజినీ కాంత్ శివకుమార్ తో పాటు కొన్ని సినిమాలలో నటించారట. అప్పట్లో శివకుమార్ మెయిన్ హీరో కాగా రజిని సెకండ్ హీరోగా నటించే వారట. రజినీ నటనను చూసిన శివ కుమార్ నీకు మంచి భవిష్యత్తు ఉంది, గొప్ప నటుడివి అవుతావని చెప్పారట. 
 
అలాగే రజినీ కాంత్ కి విపరీతమైన మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉన్నాయని తెలుసుకొని వాటిని వదిలేయమని సలహా ఇచ్చాడట. ఆ వ్యసనాలు వదలక పోతే భవిష్యత్ నాశనం అవుతుందని చెప్పారట. అయినప్పటికీ రజినీ మందు, సిగరెట్ అలవాట్లను వదలేకపోయారట. ఈ అలవాట్ల కారణంగానే రజినీ అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. రజినీ కాంత్ కి అంతటి అమూల్యమైన సలహా ఇచ్చింది మరెవరో కాదు, హీరో సూర్య తండ్రి శివ కుమార్. 
 
విపరీతమైన ఆరోగ్య సమస్యల తరువాత రజినీ కాంత్ ఆ రెండు అలవాట్లను పూర్తిగా వదిలేశారు. ఇక రజినీ తన పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు. 2021 లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీ కాంత్ పోటీ చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో రజినీ కాంత్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. చాలా కాలంగా రజిని కాంత్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎట్టకేలకు రజినీ తన అభిమానుల కోరిక తీర్చడం జరిగింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. ఈ పరిణామం రజినీకి మేలు చేసే అవకాశంకలదు .