సీనియర్‌ నటుడు, రాజకీయ వేత్త శరత్‌ కుమార్‌కి కరోనా సోకింది. తాజాగా ఆయన టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరినట్టు ఆటు రాధికా శరత్‌కుమార్‌, అలాగే తనయ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

ఇదిలా ఉంటే గతంలో శరత్‌ కుమార్‌కి కరోనా సోకిందనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఆయనకు కోవిడ్‌ -19 వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాలను ఆయన రెండో భార్య రాధికా శరత్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సేఫ్‌గానే ఉన్నట్టు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శరత్‌ కుమార్‌ కూతురు, నటి వరలక్ష్మి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. 

కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్ట్ చేసుకోగా, పాజిటివ్‌ అని తేలిందట. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. శరత్‌ కుమార్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తమిళనాట రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటున్నారు.