సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారీన పడుతున్నారు. ఇప్పటికే సౌత్ లో చాలా మంది నటీనటులు కోవిడ్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు శరత్ కుమార్ కరోనా బారీన పడ్డారు.
సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారీన పడుతున్నారు. ఇప్పటికే సౌత్ లో చాలా మంది నటీనటులు కోవిడ్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు శరత్ కుమార్ కరోనా బారీన పడ్డారు. అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ శరత్ కుమార్ కి కోవిడ్ సోకింది.
ఈ విషయాన్ని శరత్ కుమార్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'నా స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ గుడ్ ఈవెనింగ్. ఈ సాయంత్రం నేను కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. గత కొన్నిరోజులుగా నాతో కాంటాక్ట్ లో ఉన్న వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోండి అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లో శరత్ కుమార్ కి కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది. గతంలో కూడా శరత్ కుమార్ కరోనాకు గురై కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆయనకు కోవిడ్ సోకడంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు పెడుతున్నారు. శరత్ కుమార్ 90వ దశకంలో బాగా పాపులర్ అయిన నటుడు. చిరంజీవి గ్యాంగ్ లీడర్, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. రాఘవ లారెన్స్ కాంచన చిత్రంలో టైటిల్ రోల్ లో హిజ్రాగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
