Asianet News TeluguAsianet News Telugu

Balakrishna: బాలయ్య 108 సెట్స్ లో జాయిన్ అయిన కోలీవుడ్ సీనియర్ హీరో..!

బాలయ్య-108 మూవీలో కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన బాలయ్య 108 మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. శరత్ కుమార్ తో ఫోటోకి ఫోజిచ్చిన అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్ అవుతుంది.
 

actor sarath kumar joins balakrishna 108th movie
Author
First Published Dec 17, 2022, 1:02 PM IST


బాలయ్య జోరు మాములుగా లేదు. ఆయన గ్యాప్ లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి విడుదల కాకుండానే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లారు. బాలయ్య 108వ చిత్రంగా తెరకెక్కుతున్న అనిల్ రావిపూడి డైరెక్టోరియల్ చకా చకా షూట్ జరుపుకుంటుంది. బాలయ్య చాలా ఎనర్జిటిక్, వీలైనంత త్వరగా మూవీ పూర్తి చేయాలని దర్శకులను పరుగులు పెట్టిస్తారు. బాలయ్య ఏ సినిమాకు కూడా ఏడాది సమయం తీసుకున్న దాఖలాలు లేవు. ఆరు ఏడు నెలల్లోనే మొత్తం చుట్టేస్తాడు. 

బాలయ్య(Balakrishna) లాంటి హీరోలకు  అనిల్ రావిపూడి సరైన జోడి. అనిల్ రావిపూడి సైతం షూటింగ్ త్వరగా పూర్తి చేయడంలో ఘనుడు. మహేష్ వంటి స్టార్ తోనే అనిల్ ఏడెనిమిది నెలల్లో షూట్ పూర్తి చేసి సంక్రాంతి విడుదలకు సిద్ధం చేశాడు. కాబట్టి బాలయ్య 108(NBK 108) మూవీ వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

కాగా ఈ చిత్రంలో కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన బాలయ్య 108 మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. శరత్ కుమార్ తో ఫోటోకి ఫోజిచ్చిన అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్ అవుతుంది.
 
కాగా వీరసింహారెడ్డి(Veerasimhareddy) చిత్రంతో బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. వాల్తేరు వీరయ్య, వారసుడు చిత్రాలకు మించిన బజ్ వీరసింహారెడ్డి చిత్రంపై నెలకొంది. ఇక సంక్రాంతి హీరోగా బాలయ్య గతంలో ఇండస్ట్రీ రికార్డ్స్ నెలకొల్పోయారు. ఆ చరిత్ర రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న వీరసింహారెడ్డి మూవీలో శృతి హాసన్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios