హీరోయిన్ల మధ్య ఫ్యాన్ వార్ జరిగితే ఎలా ఉంటుందో.. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అయితే.. అందరికీ తెలిసిపోతుంది. ఇప్పటి వరకు హీరోల కోసం కొట్టుకున్న ఫ్యాన్స్ ఉన్నారు కానీ.. హీరోయిన్ల కోసం కొట్టుకోవడం ఇదే తొలిసారేమో బహుశా.
 ప్రస్తుతం సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ.. సమంత, పూజ ల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి తెలిసిందే.

అయితే.. తాజాగా.. ఈ విషయంలో తనను ద్వేషించేవారికి, ట్రోలర్స్ కి సమంత అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాధానం వింటే ఎవరికైనా బుర్రలు తిరిగిపోవాల్సిందే. ఇంకోసారి ఆమెను ట్రోల్ చేయడానికి కూడా ఆలోచించేలా ఇచ్చింది.

తనను ద్వేషించే వాళ్లను చూస్తుంటే తనలో ఇంకా కసి పెరుగుతుందని చెప్పుకొచ్చింది సమంత. అదే పొగిడితే మాత్రం తనలో బద్ధకస్థురాలిగా మారిపోతానని చెబుతుంది సమంత. అందుకే విమర్శించే వాళ్లే తనకు మేలు చేస్తారని సమంత ట్వీట్ చేయడం విశేషం.

 

ఇక.. మూడు రోజుల క్రితం..  మజిలీ సినిమాలోని సమంత స్క్రీన్ షాట్ చూపిస్తూ అందులో అంత అందంగా ఏం లేదని.. అలా ఉంటుందని కూడా తాను అనుకోవడం లేదని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది పూజా. ఇది చూసిన తర్వాత సమంత అభిమానులు రెచ్చిపోయారు. ఆ ఫోటో తీసి ఏకేయడం మొదలుపెట్టారు.

సమంత కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లు ఎంత చేసినా పూజ మాత్రం తనకు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. కాగా.. ఈ విషయంలో కొందరు పూజను సమర్దిస్తూ సమంతను విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. కాగా.. వారందరికీ కేవలం ఒకే ఒక్క ట్వీట్ తో అదిరిపోయే సమాధానం చెప్పింది సామ్. కాగా... ఆమె ట్వీట్ చేసి.. పూజతో పాటు ఆమె అభిమానులకు సామ్ గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ అక్కినేని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.