ప్రముఖ భోజ్‌పురి నటుడు రవికిషన్ బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో 'రేసుగుర్రం' సినిమాలో విలన్ గా నటించి పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే రీసెంట్ గా ఆయన ఓ ఫ్లాట్ తీసుకుందామని రూ.1.5 కోట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే వారు తనను మోసం చేసినట్లు గ్రహించాడు. ముంబైలో ఫ్లాట్ తీసుకుందామని కమల ల్యాండ్ మార్క్ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు రవికిషన్ కోటిన్నర అందించారు. ఆ సంస్థ దానికి తగ్గట్లు పేపర్ వర్క్ ని కూడా రవికిషన్ కి ఇచ్చింది.

కానీ ఫ్లాట్ మాత్రం ఇవ్వకపోవడంతో అడగడానికి వెళ్లిన రవికిషన్ తాను మోసపోయానని గ్రహించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవికిషన్ తో పాటు సునీల్ నాయర్ అనే వ్యక్తిని కూడా బిల్డర్లు రూ.6.5 కోట్ల ముంచేశారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులపై దర్యాప్తు చేపట్టారు.