Asianet News TeluguAsianet News Telugu

రావు రమేష్ పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు... ఆయన ఔదార్యానికి సలాం అంటున్న జనాలు!

రావు రమేష్ గొప్ప నటుడే కాదు గొప్ప మనసున్న వ్యక్తి అని కూడా నిరూపించుకున్నాడు. తన వద్ద పని చేసిన సిబ్బంది ఒకరు మరణించగా ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకున్నారు. 
 

actor rao ramesh donates rupees ten lakhs to deceased employees family
Author
First Published Sep 16, 2022, 1:53 PM IST

విలక్షణ నటుడు రావు రమేష్ తన ఔదార్యం చాటుకున్నారు. ఆయన వద్ద పని చేసిన ఓ వ్యక్తి అకాల మరణం చెందగా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. బాబు అనే మేకప్ ఆర్టిస్ట్ చాలా కాలంగా రావు రమేష్ వద్ద పని చేస్తున్నారు. బాబు అకాల మరణం చెందారు. దీంతో రావు రమేష్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాబు కుటుంబ సభ్యులను కలిసి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేశారు. బాబు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రావు రమేష్ చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తన వద్ద పని చేసిన  ఉద్యోగి కుటుంబం గురించి ఇంతలా ఆలోచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రావు రమేష్ గొప్ప నటుడే కాదు మనసున్న మనిషి కూడా అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. లెజెండ్ రావు గోపాలరావు నటవారసుడిగా రావు రమేష్ పరిశ్రమకు పరిచయం అయ్యారు. సీమ సింహం ఆయన మొదటి చిత్రం. పరిశ్రమలో ఎవరి మద్దతు లేకున్నా స్వశక్తితో , టాలెంట్ ని నమ్ముకొని గొప్ప స్థాయికి వెళ్లారు. 

టాలీవుడ్ విలక్షణ నటుల్లో రావు రమేష్ ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తీరిక లేని నటుడయ్యాడు. ఇతర భాషల్లో కూడా రావు రమేష్ సత్తా చాటుతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టిన కెజిఎఫ్ 2 మూవీలో రావు రమేష్ కీలక రోల్ చేయడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios