చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనానికి కారణం...? క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.
చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్(Jr NTR) ఎందుకు స్పందించలేదు.. చాలా కాలంగా జరుగుతున్న చర్చ ఇదే. అసలు మామ అరెస్ట్ పై అల్లుడు స్పందించపోవడానికి కారణం ఏంటీ..? తాజాగా ఈ విషయంపై స్పందించారు నటుడు రాజీవ్ కనకాల.
ఏపీ మాజీ సీఎం, సీనియర్ రాజకీయా నాయకుడు చంద్రబాబు బాబు నాయుడుఅరెస్ట్ ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా బాబు అభిమానులు ఈ విషయంలో ఇప్పటికీ ఆధోళణలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నాయకులు, పలువురు అభిమానులు విమర్శలు చేస్తూ, అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటికే రాజకీయ నాయకులతో పాటు.. సినీ ప్రముఖులు స్పందించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకపోవడం పెద్ద చర్చగా మారింది. నందమూరి కుటుంబం కూడా అరెస్ట్ కి నిరసనగా మాట్లాడారు. కాని తారక్ స్పందించకపోవడమే రచ్చగా మారింది.
తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయంపై నటుడు, ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు.
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజీవ్.. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్(Jr NTR) మౌనం గురించి, ఎన్టీఆర్ పై వచ్చే విమర్శల గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూ సందర్భంగా ీ విషయంపై స్పందించమని యాంకర్ అడగగా.. రాజీవ్ సమాధానమిస్తూ.. ఆయనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే అతనే చెప్తాడు. గతంలో తారక్ పార్టీకి ప్రచారం చేశాడు... పవర్ ఫుల్ స్పీచ్ లతో ఉరకలు పెట్టించాడు.. కాని ఇప్పుడు తారక్ కు పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని నా అభిప్రాయం. ముందు సినిమాల మీద దృష్టి పెట్టి.. ఓ అయిదారేళ్ళ తరువాత పాలిటిక్స్ పై ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కాని కొంతమంది అతనిపై కావాలని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారా లేకా నిజంగానే నెగిటివ్ వస్తుందా అనేది సోషల్ మీడియాలో తెలియట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది నాకు కచ్చితంగా తెలీదు. అతను దాని గురించి నా దగ్గర మాట్లాడలేదు అని అన్నారు రాజీవ్ కనకాల అంతే కాదు ఆర్ఆర్ఆర్ సినిమా టైమ్ లో కరోనా వల్ల నాలుగేళ్లు ఎన్టీఆర్ టైమ్ వేస్ట్ అయిపోయింది. అప్పుడు ఇబ్బందులు లేకుంటే.. మూడు సినిమాలు చేసేవాడు అన్నారు రాజీవ్. ఇక ప్రస్తుతం దేవర బిజీలో ఉన్నాడు. అతనికి నటన అంటే ఇష్టం. వీటి మీద ఫోకస్, సినిమాల బిజీ వల్లే స్పందించట్లేదేమో. అయినా ఎన్టీఆర్ రావాలనుకున్నప్పుడు, రాజకీయాలు నేర్చుకొని మరీ వస్తాడేమో. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒక పార్టీకి కొమ్ము కాయడం, పార్టీ పరంగా విమర్శలు చేయడం వేరు. కానీ ఇప్పుడు అంతా తిట్టుకోవడాలే ఉంది. అది కరెక్ట్ కాదు అని అన్నారు రాజీవ్.