ప్రముఖ బాలీవుడ్ నటుడు,జాతీయ అవార్డు విన్నర్ రాజ్‌కుమార్ రావు చిక్కుల్లో పడ్డారు ఆయన పాన్ కార్డ్ మిస్‌యూజ్ అయ్యింది. తాజాగా ఆ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు మోసగాళ్లకి దొరికిపోయారు. ఆయన పాన్ కార్డ్ దుర్వినియోగం కావడం ఇప్పుడు బాలీవుడ్‌కి షాకిస్తుంది. తన పాన్ కార్డ్ ఉపయోగించి కొందరు దుండగులు లోన్ తీసుకున్నారని ఆరోపించారు రాజ్‌కుమార్‌రావు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన పాన్ కార్డ్ తో జరిగిన మోసాన్ని వివరించారు.
ట్విట్టర్‌లో రాజ్‌కుమార్ రావు చెబుతూ, `నా పాన్ కార్డ్ దుర్వినియోగమైంది. నా పేరుని ఉపయోగించుకుని రూ.2500లను లోన్‌గా తీసుకున్నారు. దీంతో నా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ఈ సమస్యను పరిష్కరించాలని సిబిల్‌ని కోరుతున్నా` అని హీరో రాజ్‌కుమార్‌రావు వెల్లడించారు. దీంతో సిబిల్ స్పందించింది. ఆయనకు జరిగిన అసౌకర్యం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇలాంటిది జరిగిఉండాల్సింది కాదని, తాము దాన్ని పరిష్కరిస్తామని తెలిపిది.
ఇదిలా ఉంటే రాజ్‌కుమార్‌రావు మోసపోవడం ఈ ఏడాది రెండోసారి. ఇప్పటికే ఆయన తన పేరుని దుర్వినియోగం చేశారని, రూ. మూడు కోట్లు మేరకు మోసం చేసే ఉద్దేశ్యంతో ఇతరులకు మెయిల్ పంపించారని రాజ్‌కుమార్‌రావు పేర్కొన్నారు. బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు రాజ్‌కుమార్‌రావు. ఆయన `క్వీన్`, `న్యూటన్`, `స్ట్రీ`, `లూడో`, `బధాయి దో` వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన `బధాయి దో` సినిమా మంచి ప్రశంసలందుకుంది. ఇందులో భూమి పడ్నేకర్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఆయన `మోనికా`, `ఓ మై డార్లింగ్` చిత్రాలు చేస్తున్నారు.
