కమెడియన్ పృథ్వి అనారోగ్యం బారినపడ్డారు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఆయన వీడియో వైరల్ అవుతుంది.

30ఇయర్స్ పృథ్వి అనారోగ్యానికి గురయ్యారు. మొదటిసారి ఆయన 'కొత్త రంగుల ప్రపంచం' అనే టైటిల్ ఒక మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర సెట్స్ లో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ఆసుపత్రిలో చేరిన పృథ్వికి సెలైన్ ఎక్కించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

“ఫస్ట్ టైం ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. నేను తెరకెక్కిస్తున్న కొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి. 26న పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నాను. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకి, మా టీమ్ కి మీ అందరి సపోర్ట్ ఉండాలి” అంటూ బెడ్ పై నుండి పృథ్వి సందేశం ఇచ్చారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇది ప్రమోషనల్ స్టంట్ కూడా కావచ్చని కొందరు భావిస్తున్నారు. కాగా పృథ్వి సుధీర్ఘకాలం పరిశ్రమలో ఉన్నారు. గత ఇదేళ్లుగా పృథ్వి రాజకీయాల్లో యాక్టీవ్ ఉంటున్నారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న పృథ్వి ఇటీవల జనసేలో చేరారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.