నటుడిగా, కమెడియన్ గా పృథ్వి రాజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పృథ్విరాజ్ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టాడు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో జగన్ కు మద్దతు తెలిపి వైసిపి తరుపున ప్రచారం నిర్వహించాడు. జగన్ పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు వ్యవహరిస్తున్న వైఖరిని మొదటిని నుంచి పృథ్విరాజ్ తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. 

ఇటీవల పృథ్వి రాజ్ కు టిడిడి ఎస్వీబిసి ఛానల్ చైర్మన్ గా పదవి లభించిన సంగతి తెలిసిందే. ఈ పదవి తనకు లభించడం చాలా సంతోషంగా ఉందని పృథ్వి అంటున్నాడు. ఇకపై సినిమాల్లో కొనసాగే విషయం గురించి మాట్లాడుతూ అవకాశం ఉంటే చేస్తానని అన్నారు. కానీ ఇటీవల మీరు వార్తలు చూస్తూనే ఉన్నారు. వీడు వైసీపీకి మద్దతు తెలిపాడు.. సినిమా నుంచి తీసేయండి అనే సంఘటనలు జరుగుతున్నట్లు పృథ్వి పేర్కొన్నాడు. 

సినిమా వాళ్లకు జగన్ అంటే మొదటి నుంచి పడదు. ఒకవేళ టిడిపి అధికారంలోకి వచ్చి ఉంటె టాలీవుడ్ మొత్తం విమానాల్లో దిగిపోయేది. జగన్ కు పువ్విచ్చి ఒక్కరు కూడా శుభాకాంక్షలు చెప్పలేదు అని పృథ్వి మండిపడ్డాడు. మీరు కూడా సినిమావారే కదా అని ప్రశ్నించగా.. నేను వైసిపిలో సినిమావాడిగా పనిచేయలేదు. కార్యకర్తగా కష్టపడ్డాను అని పృథ్వీ బదులిచ్చాడు.