బాలకృష్ణ-టబుపై తెరకెక్కిన సాంగ్ ని ట్రోల్ చేస్తూ ఎడిట్ వీడియో ఒక నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. సదరు వీడియోకి నటుడు ప్రకాష్ రాజ్ లైక్ కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని సీన్స్ సినిమాటిక్ వరల్డ్ ని దాటి ఉంటాయి. సినిమా కల్పితమే కావచ్చు. వాస్తవాలకు, భౌతిక సూత్రాలకు భిన్నంగా కొన్ని సీన్స్ రాసుకునే స్వేచ్ఛ ఉంది. అలాగని సగటు సినిమా అభిమాని కూడా మరీ దారుణం, ఇది సాధ్యమేనా అనుకునేలా సీన్స్ ఉండకూడదు. యాభై కేజీల బరువుండే హీరో రెండు టన్నుల కార్ ని తన్నగానే ఆమడ దూరం జరగడం. ఒక దెబ్బకు పదిమంది విలన్స్ గాల్లో ఎగరాడలను కూడా ప్రేక్షకులు ఒప్పుకుంటున్నారు. అంతకు మించి ఉంటేనే ప్రాబ్లమ్. ప్రేక్షకుల్లో నవ్వులపాలు కావాల్సి వస్తుంది.
బాలయ్య సినిమాల్లో ఈ తరహా సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. పలనాటి బ్రహ్మనాయుడు మూవీలో బి గోపాల్ తన క్రియేటివిటీతో బాలయ్య పరువు తీశాడు. డైరెక్టర్స్ చెప్పింది గుడ్డిగా చేసే బాలయ్య కూడా ఒప్పుకొని కొన్ని సీన్స్ లో నటించారు. ఆయన తొడగొట్టి ట్రైన్ ని వెనక్కి పంపించడం చూసి థియేటర్స్ లో ప్రేక్షకులకు జ్వరం వచ్చింది. ఈ రేంజ్ హీరోయిజం, ఎలివేషన్స్ చూడలేము బాబోయ్ అంటూ... పరుగులు తీశారు. ట్రైన్ బోగీల మీద బైక్ నపడటం, ట్రైన్ క్రిందపడి కూడా బ్రతకడం ఇలా బాలయ్య ఖాతాలో లాజిక్ లేని మ్యాజికల్ సీన్స్ చాలానే ఉన్నాయి.
పాటల్లో కూడా బాలయ్య గ్రాఫిక్స్ వాడి అబాసుపాలయ్యాడు. సాంగ్స్ లో స్టెప్స్ సీజీ చేసి పెట్టేవారు. కాగా ఎన్టీఆర్ కి మెమరబుల్ హిట్స్ ఇచ్చిన కే రాఘవేంద్రరావు కొడుకు బాలయ్యకు ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. ఇక వీరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం పాండురంగడు కూడా ఫలితం ఇవ్వలేదు. పైగా బాలయ్య పరువు తీసింది. బాలయ్య క్యారెక్టర్ లోతులు చూపే క్రమంలో రాఘవేంద్రరావు క్రియేటివిటీ గతి తప్పింది. పాండురంగడు మూవీలో భక్తిరసం కంటే శృంగార రసం ఎక్కువైంది.
ఈ మూవీలో వేశ్యల మాయలో పడిన యువకుడిగా బాలయ్య నటించారు. టబు వేశ్య పాత్ర చేశారు. బాలయ్య-టబు మీద రాఘవేంద్రరావు తన మార్క్ రొమాంటిక్ సాంగ్ షూట్ చేశాడు. సదరు సాంగ్ లో బాలయ్యతో బత్తాయిలు పిండించడం నుండి దారుణమైన పనులు చేయించారు. ఇక టబు బొడ్డును జ్యూస్ ఫ్యాక్టరీగా మార్చేశాడు. కొలనులో మునుగుతున్న టబును బాలయ్య చిటికిన వేలితో ఎత్తడం క్రీటివిటీలో నెక్స్ట్ లెవెల్.
ఈ సాంగ్ ని ట్రోల్ చేస్తూ తమిళ తంబీలు ఎడిట్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోను ప్రకాష్ రాజ్ లైక్ చేశాడు. బాలయ్యను అవమానిస్తున్నట్లున్న ట్రోల్ వీడియోపై ప్రకాష్ రాజ్ స్పందించడం, లైక్ కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ కూడా బాలయ్యను ఎగతాళి చేస్తున్నారా? లేదా క్యాజువల్ గా అలా లైక్ చేశాడా? అనే చర్చ మొదలైంది.
