క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందకు పైగా చిత్రాలు చేసినా దక్కని గుర్తింపు, సోషల్ మీడియా ద్వారా రాబట్టింది నటి ప్రగతి (Pragathi). ఈ సీనియర్ నటి ఇంస్టాగ్రామ్ వీడియోలు కొన్నాళ్లుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. అదే సమయంలో ట్రోల్స్ కి గురవుతున్నాయి. నెగిటివ్ కామెంట్స్ లెక్కని చేయని ప్రగతి... తన పంథా కొనసాగిస్తున్నారు.
44 ఏళ్ల ప్రగతి సోషల్ మీడియాలో సంచలనాలు చేస్తున్నారు. ఆమె డాన్స్, ఫిట్నెస్ వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో తల్లి, అత్త, వదిన వంటి పాత్రలు చేసే ప్రగతి ఇమేజ్ పూర్తిగా మార్చేసింది సోషల్ మీడియా. ప్రగతి చేసే పాత్రల రీత్యా.. ఆమె చాలా నెమ్మదస్తురాలని జనాలు అనుకున్నారు. కానీ ప్రగతి సూపర్ షార్ప్ అని ఆమె వీడియోల ద్వారా తెలిసింది. ప్రగతి తనలోని ఫైర్, ఎనర్జీ ఫ్యాన్స్ కి పరిచయం చేసి షాక్ ఇచ్చింది.
ఏడాది కాలంగా ప్రగతి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డాన్స్ వీడియోలు చేయడం ఆమెకు అలవాటుగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ప్రగతి జోరు చూసిన నెటిజెన్స్ మొదట్లో షాక్ కి గురయ్యారు. ప్రగతిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయారు. అలాగే ప్రగతి తన ఫిట్నెస్ వీడియోలు కూడా షేర్ చేయడం ప్రారంభించారు. సదరు వీడియోలలో ప్రగతి డ్రెస్ సెన్స్ ట్రోల్ల్స్ కి దారి తీసింది.
ఈ వయసులో ఇంకా ఏం సాధించాలని ఆంటీ? హీరోయిన్ అవుదామనుకుంటున్నావా?.. లాంటి నెగిటివ్ కామెంట్స్ ప్రగతికి ఎదురయ్యేవి. సదరు కామెంట్స్ కి ప్రగతి రియాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తే.. మీకు ఇబ్బంది ఏమిటీ? నేను చేసే డాన్స్ వీడియోలు, ధరించే డ్రెస్ నా వ్యక్తిగతం, మీలాంటి వారి నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకోనంటూ, ట్రోల్ చేసేవారి నోళ్లు మూపించే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియాలో ప్రగతి వీడియోలు నిత్యకృత్యం కాగా.. తాజాగా బాలీవుడ్ ఐటెం నంబర్ 'నాగిని నాగిని' (Nagini Nagini)సాంగ్ కి డాన్స్ చేసి మెస్మరైజ్ చేశారు. ఈ సాంగ్ కి ప్రగతి జిమ్ వేర్ లో డాన్స్ చేయడం విశేషంగా మారింది. ప్రగతి సూపర్ హాట్ సాంగ్ కి అద్భుతమైన స్టెప్స్ వేశారు. ఇక ఎప్పటిలాగే ఆమె వీడియోకి ప్రశంసలు, విమర్శలు దక్కుతున్నాయి. ప్రగతి డాన్స్ వీడియో వైరల్ గా మారింది. ఆస్వాదించే మనసు ఉండాలి కానీ.. వయసు అడ్డుకాదని ప్రగతి నిరూపిస్తున్నారు.
