Asianet News TeluguAsianet News Telugu

నా సోదరుడు పవన్ కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.. రోజా భర్తని వెనకేసుకొచ్చిన నాజర్

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోలివుడ్ పై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో కేవలం తమిళ నటులే కాకుండా అన్ని భాషల నటులకు అవకాశాలు ఇవ్వాలని పవన్ కోరారు. 

Actor Nassar interesting comments on Pawan Kalyan over Kollywood dtr
Author
First Published Jul 27, 2023, 7:50 PM IST

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోలివుడ్ పై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో కేవలం తమిళ నటులే కాకుండా అన్ని భాషల నటులకు అవకాశాలు ఇవ్వాలని పవన్ కోరారు. తమిళ పరిశ్రమలోకి ఇతర భాషల వాళ్లను రానివ్వండి.. అప్పుడే ఎదిగే అవకాశం ఉంటుంది.. ఎంత వరకు అలా నిబంధనలు పెట్టుకుని ఉంటామో.. అంత వరకు పైకి ఎదగలేమంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.

ఈ కామెంట్స్ పై పెద్ద దుమారమే చెలరేగింది. పవన్ వ్యాఖ్యలపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ సమాచారం తప్పుగా ప్రచారం అవుతోంది. తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని ఖండిస్తాను. దాన్ని వ్యతిరేకిస్తాను. సినిమా పరిశ్రమ, కళాకారులు అనే వాళ్లకు సరిహద్దులు ఉండవు. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నా సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు.

ఈ సందర్భంగా నాజర్ రోజా భర్త సెల్వమణి వెనకేసుకొస్తూ సపోర్ట్ చేశారు. సెల్వమణి పెట్టిన రూల్స్ నటుల కోసం కాదు. సినీ కార్మికుల కోసం ఆయన ఆ రూల్ పెట్టారు అని నాజర్ అన్నారు. తమిళ్ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లు పెట్టుకోండని అన్నారు. అంతే కానీ ఇతర భాషల వ్యక్తులని వద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడు ఒక భాష అని ఏం లేదు. అన్నీ కూడా ప్యాన్ ఇండియన్ సినిమాలు అయ్యాయి. 

ఓటీటీ వినియోగం ఎక్కువైంది. ఇలాంటి టైంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. వారిని ఆదరించింది. ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారు, వాణీ శ్రీ గారు, శారద అమ్మ గారు ఇలా చాలా మంది తమిళులే అని అనుకున్నాను. చాలా కాలం తరువాత నాకు వాళ్లది ఆంధ్రా అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios