నరేష్ నాలుగో భార్య పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరో తెలుసా? ఆయన కూడా నటుడే!
నటుడు నరేష్-పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్నారు. వీరికి వివాహం జరిగిందో లేదో స్పష్టత లేదు. కాగా పవిత్ర లోకేష్ మొదటి భర్త కూడా నటుడే. ఆయనతో పవిత్రకు పిల్లలు కూడా ఉన్నారు.
నటి పవిత్ర లోకేష్ పేరు ఆ మధ్య మీడియాలో ప్రముఖంగా వినిపించింది. నటుడు నరేష్ ని ఆమె వివాహం చేసుకున్నారని అధికారిక సమాచారం లేదు. కానీ కలిసి జీవిస్తున్నారు. నరేష్ తో పవిత్ర లోకేష్ బంధం మొదలై చాలా ఏళ్ళు అవుతుంది. మరోవైపు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరి బంధాన్ని వ్యతిరేకిస్తుంది.
కాగా పవిత్రతో పెళ్లి వార్తలపై గతంలో నరేష్ స్పందించారు. వివాహ వ్యవస్థ అనవసరం. పది జంటల్లో ఆరు జంటలు విడిపోతున్నాయి. నా లైఫ్ స్టైల్ కారణంగానే మూడు సార్లు విడాకులు అయ్యాయి. సెలెబ్రిటీలం కాబట్టి మా పెళ్లిళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. సమాజంలో ఎవరూ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా? అంటూ ఎదురుదాడికి దిగాడు. అయితే పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకుంది లేనిది... క్లారిటీ ఇవ్వలేదు.
పవిత్ర లోకేష్ మొదటి భర్త నుండి అధికారికంగా విడాకులు తీసుకోలేదు. ఆ కారణంగానే నరేష్, పవిత్ర రహస్య వివాహం చేసుకున్నారు. విడాకులు వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారనే ఒక వాదన ఉంది. ఈ క్రమంలో అసలు పవిత్ర మొదటి భర్త ఎవరు ఆయన నేపథ్యం ఏమిటో తెలుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దాం..
పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ కన్నడ పరిశ్రమకు చెందిన నటుడు, ఆయన రచయిత, దర్శకుడు కూడాను. 2002లో మల్లికా ప్రసాద్ సిన్హా అనే అమ్మాయిని అతడు వివాహం చేసుకున్నారు. వీరికి 2006లో విడాకులు అయ్యాయి. అనంతరం 2007లో పవిత్ర లోకేష్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కోనేళ్ళుగా సుచేంద్ర ప్రసాద్ తో పవిత్ర విడిగా ఉంటున్నారు. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తగా విడాకుల వరకు మేటర్ వెళ్లిందట. అయితే సుచేంద్రని పవిత్ర ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం.
నరేష్ తో బంధం ఏర్పడక ముందు ఓ ఇంటర్వ్యూలో భర్త సుచేంద్ర తో ప్రేమ, పెళ్లికి సంబంధించిన సంగతులు ఆమె షేర్ చేశారు. మేమిద్దరం కలిసి ఒక సీరియల్‌లో నటించాం. అది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలియదు గానీ.. ఒకరిపై ఒకరికి అభిమానం కలిగింది. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాతో పోల్చుకుంటే ఆయన స్థాయి ఎక్కడో ఉంది. అలాంటి వ్యక్తిని మరొకరిలో చూడలేం. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా నేను గమనించలేదు. నాతో ఎంతో గౌరవంతో మెలుగుతారు, అని పవిత్ర తెలిపారు.
పవిత్ర ఇంకా మాట్లాడుతూ... ఆయన రచయిత, దర్శకుడు, నటుడు కూడా. కానీ, నాకు నటుడిగానే నచ్చుతారు. మేము కలిసి జంటగా నటించే అవకాశం వచ్చింది. కానీ, ఇద్దరం ఒకేసారి షూటింగ్‌కు వెళ్తే పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరు. అందుకే చాలా అవకాశాలను వదులుకొనేవాళ్లం. అలాంటి భర్త దొరికినందుకు నేను చాలా లక్కీ. కొంచెం టైమ్ ఉన్నా సరే సుచేంద్ర నాకు వండి పెడతారు. ఇంట్లో అన్ని పనులు ఆయన చేస్తారు.
ఆయన నేను తనకే సొంతమని భావించేవారు. అందుకే, నా సినిమాలు కూడా చూసేవారు కాదు. నేను కూడా ఏ రోజు ఒత్తిడి చేయలేదు. నా సినిమాల్లో మీకు నచ్చిన చిత్రం ఏమిటని కూడా అడగలేదు. ఆయన కూడా తనకు ఏ సినిమా నచ్చిందనే విషయాన్ని చెప్పరు. ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాలు గురించి మేం మాట్లాడుకోమని పవిత్ర తెలియజేశారు. ఆమె మాటలను బట్టి సుచేంద్రపై ఆమెకు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. అలాంటి వీరి మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయనేది ఆసక్తికరం.
అయితే పవిత్ర లోకేష్ తనను వదిలేశాక సుచేంద్రన్ కీలక ఆరోపణలు చేశారు. పవిత్ర నరేష్ పక్కన చేరడానికి కారణం డబ్బు. నరేష్ , పవిత్ర ఇద్దరూ కలిసి జల్సాలు చేస్తూ విజయ నిర్మలమ్మ గారి కష్టార్జితాన్ని పాడు చేస్తున్నారు. అంతే కాదు లగ్జరీగా జీవించడం పవిత్రకు ఇష్టం అని ఆమెకు డబ్బులు ముఖ్యమని సుచేంద్ర ప్రసాద్ చెప్పారు. సుచేంద్ర మాట్లాడుతూ.. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నరేస్ ను పెళ్లి చేసుకుందని.. అతడి దగ్గర డబ్బు అయిపోతే మరొకరి దగ్గరకు వెళ్లిపోతుందని ఆరోపణలు వేశారు. తన డబ్బు వ్యామోహంతో కన్న పిల్లలను కూడా వదిలేసి వెళ్లిపోయిందన్నారు. సుచీన్ద్రం కామెంట్స్ అప్పట్లో సంచలనం రేపాయి.
గత ఏడాది మళ్ళీ పెళ్లి టైటిల్ తో పవిత్ర లోకేష్, నరేష్ ఒక చిత్రం చేశారు. అది నరేష్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి పాత్రలు కూడా ఉన్నాయి. ఈ సినిమా విడుదల ఆపాలంటూ రమ్య రఘుపతి కేసు వేసింది. తన క్యారెక్టర్ ని కించపరిచేదిగా ఆ మూవీలో చిత్రీకరించారని ఆమె ఆరోపణలు చేశారు. మళ్ళీ పెళ్లి చిత్రాన్ని మాత్రం ఆమె ఆపలేకపోయింది. నన్ను మంచిగా చూసుకునే తోడు దొరికింది ఇక నా జీవితం పవిత్రతోనే అని నరేష్ పలుమార్లు వెల్లడించారు.