Asianet News TeluguAsianet News Telugu

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై స్పందించిన నరేష్.. అసలు విషయం ఇదేనంట.. కానీ?

సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కృష్ణ హెల్త్ కండీషన్ పై నటుడు నరేశ్ స్పందించారు.
 

Actor Naresh reacted on Superstar Krishnas health Condition!
Author
First Published Nov 14, 2022, 1:55 PM IST

సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెలవారు జామున 2 గంటలకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కృష్ణకు వైద్యులు చేయాల్సిన చికిత్సను అందిస్తూ తమప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సీనియర్ నటుడు నరేశ్ (Naresh) స్పందించారు. కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిని, ఎలాంటి పరిస్థితితో ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందన్ని తెలియజేశారు. 

నిన్న అర్ధరాత్రి కృష్ణను ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నరేశ్ స్పందిస్తూ.. కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. రెగ్యూలర్  చెకప్ లోనే భాగంగా ఆస్ప్రతిలో చేర్పించామన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ అభిమానులకు ధైర్యం చెప్పారు. కానీ రెండు రోజులు ఆస్పత్రిలోనే ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు  ఉండాల్సి వస్తోందని అన్నారు. నరేశ్ చెప్పిన మాటలు కాస్తా ఊరటనిచ్చాయి. 

కానీ... వైద్యులు చెప్పిన మాటలు మాత్రం కృష్ణ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. శరీరం సహకరించకపోవచ్చు.. 48 గంటలు దాటితేనే ఏమైనా చెప్పగలం అంటున్నారు. ఆయన కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని డాక్టర్లు చెప్పడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు వెంటిలేటర్ పైనే కృష్ణ చికిత్స పొందుతుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని అర్థమవుతుందని అంటున్నారు. ఇక సినీ ప్రముఖులు కూడా ఆస్పత్రికి వచ్చి కృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వెళ్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios