జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకులని ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తోంది. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లాంటి కమెడియన్లు కామెడీ స్కిట్ లు చేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. మంచి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ షో ప్రస్తుతం కుదుపుకు గురైంది. జబర్దస్త్ ఆరంభం నుంచి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు ఈ షోనుంచి తప్పుకున్నారు. 

కొన్ని బిజినెస్ పరమైన కారణాలు, విభేదాల వల్ల తాను షో నుంచి తప్పుకుంటున్నట్లు నాగబాబు ప్రకటించారు. నాగబాబుని అనుసరిస్తూ మరికొందరు కూడానా జబర్దస్త్ ని వీడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లో నాగబాబు స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే ఆసక్తి నెలకొంది ఉంది. 

గత కొన్ని రోజులుగా నాగబాబు స్థానంలో నరేష్ జబర్దస్త్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నరేష్ కు జబర్దస్త్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా ఇంటర్వ్యూలో నరేష్ స్పందించారు. 

కాజల్ అగర్వాల్ రేర్ ఫీట్.. అతడి తండ్రితో రొమాన్స్!

జబర్దస్త్ ఆఫర్ వచ్చిందనే ప్రచారంపై నరేష్ మాట్లాడుతూ.. జబర్దస్త్ పాపులర్ షో.. ఆ కామెడీ షోని నేను బాగా ఎంజాయ్ చేస్తా. ఈ షోకి జడ్జిగా వ్యవహరించే విషయం నావరకు అయితే రాలేదు. ఆఫర్ వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతం నేను సినిమాల్లో నటుడిగా బిజీగా ఉన్నాయి. నెలలో 29 రోజులు షూటింగ్స్ కు వెళుతున్నా. 'మా' వ్యవహారాలు కూడా చూసుకోవాలి. ముందు ఆఫర్ రానీ.. ఆ తర్వాత మాట్లాడదాం అని నరేష్ అన్నారు.