నవదంపతులు నిహారిక చైతన్యలు ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఉన్నారు. హానీమూన్ వెకేషన్ కోసం వీరిద్దరూ ఇటీవల అక్కడకు వెళ్లడం జరిగింది. కాగా వీరిద్దరు కరోనా బారిన పడ్డారంటూ మీడియాలో వరుస కథనాలు వెలువడడం జరిగింది. ఈ వార్తలపై నిహారిక తండ్రి నాగబాబు స్పష్టత ఇచ్చారు. రామ్ చరణ్ తనకు కరోనా సోకినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. కరోనా బారినపడిన పడిన రామ్ చరణ్ మెగా ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. 

ఈనేపథ్యంలో ఈ వేడుకలో పాల్గొన్న వరుణ్ తేజ్ కి కూడా కరోనా సోకింది. తనకు కరోనా సోకిన విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. క్రిస్మస్ వేడుకలలో రామ్ చరణ్, వరుణ్ తేజ్ తో నిహారిక సన్నిహితంగా మెలిగారు. వీరిద్దరితో నిహారిక, చైతన్య ఫోటోలు కూడా దిగడడం జరిగింది. దీనితో నిహారిక, చైతన్యలు కూడా కరోనా బారినపడ్డారంటూ వార్తలు వచ్చాయి. 

కాగా నిహారిక మరియు చైతన్యలకు కరోనా సోకిందంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని నాగబాబు తెలియజేశారు. మాల్దీవ్స్ కి వెళుతూ ముంబై ఎయిర్పోర్ట్ లో కరోనా టెస్టులు చేయించుకోగా వారికి నెగిటివ్ అని తేలింది అన్నారు. అలాగే ఈనెల 29న మరో మారు కోవిడ్ టెస్టులు చేయించుకున్నారని... మరలా రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. కాబట్టి నిహారిక చైతన్య ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు.