Asianet News TeluguAsianet News Telugu

తాతల కాలం నాటి ఇంటిపై మమకారం, కోట్లు ఖర్చు పెట్టి బాగు చేయించుకుంటున్న మురళీ మోహన్

హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. రాజకీయ నాయకుడిగా..ఎంపీగా.. ఎన్నో రకాలుగా సేవ చేసి.. బిజీ జివితాన్ని గడిపారు మురళీ మోహన్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుననాడు. ఓ గొప్ప పనికి శ్రీకారంచుట్టాడు. 

Actor Murali Mohan Old House Renovation At Eluru
Author
First Published Jan 24, 2023, 1:35 PM IST

గొప్ప నటుడుగా.. రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎన్నో అవతారాలు ఎత్తారు మురళీ మోహన్. అన్ని రంగాలలో మంచి పేరు కూడా  సంపాదించాడు. ఎంతో మంది పెద్దవారు తమ సొంత ఊరికోసం ఎన్నో మంచి పనులకుశ్రీకారం చుడుతుంటారు. ఆ క్రమంలోనే మురళీ మోహన్ కూడా తన సోంత ఊరుకు సేవ చేసుకోవడంతో పాటు..ఎన్నో ఏళ్ళు తాను నివసించిన తనతాతల నాటి ఇంటికి సరికొత్త రూపం తీసుకువచ్చారు. ఆయన పుట్టి పెరిగిన ఊరిలో వారి తాతలనాటి ఇంటిని ఒరిజినల్ సోల్ మిస్ అవ్వకుండా బాగు చేయించాలని సంకల్పించారు.  

అందులో భాగంగా కోట్లు ఖర్చు చేసి ఆ ఇంటిని రీమోడలింగ్ చేయిస్తున్నారు మురళ మోహాన్. అంతే కాదు ఈ ఇంటిని తరువాతి కాలంలో ప్రజల ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తానంటున్నారు మురళీ మోహన్. ఇంతకీ ఆయన గ్రామం ఏది.. ? ఎక్కడ ఉంది..? ఏలూరు జిల్లా చాటపర్రు గ్రామం మురళీ మోహన్ ది. అక్కడ ఉండి చాలా కాలం తన జీవితాన్ని నడిపించారు స్టార్ యాక్టర్.అక్కడ ఉన్న ఇల్లు దాదాపు  98 సంవత్సరాల క్రితం కట్టింది. అప్పటి  ఇల్లు కావడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. గతంలో ఆ ఇంట్లో ప్రజా వైద్యశాల నిర్వహించేవారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ కేంద్రాన్ని మరో చోటుకి మార్చారు. ఇప్పుడు ఈ ఇల్లు పూర్తిగా పడిపోయే స్థితికి రావడంతో.. దాని రూపం కోల్పోకుండా ..సిమెంట్ తో దాన్ని రీ మోడల్ చేయిస్తున్నారు మురళీ మోహన్. దాని కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు ఆయన. అంతే కాదు ఎప్పటిలాగానే ఈ భవనాన్ని ప్రజల ప్రయోజనం కోసమే ఉపయోగిస్తామంటున్నారు మురళీ మోహన్. 

ఇక ఈ విషయంలో ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ముళీ మోహన్...ఈ విధంగా అన్నారు. నేను ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాను, నా చదువు, నేను హీరోగా మారడం, నా వ్యాపారాలు అన్నీ ఈ ఇంటి నుంచే స్టార్ట్ అయ్యాయి.. కొంత కాలం నడిచాయి.  ఈ ఇల్లు కట్టి ఇప్పటికి 98 సంవత్సరాలు కావొస్తోంది. అప్పట్లో సిమెంట్ లేదు కాబట్టి 18 అంగుళాల వెడల్పుతో ఇటుకలు, సున్నంతో కట్టారు. భవనం రూపం ఏ మాత్రం మారకుండా మరమ్మత్తులు చేయిస్తున్నాను. జన్మ భూమిని, ఉన్న ఊరిని, కన్న తల్లిని మర్చిపోకండి, మన ఊరిని గుర్తు పెట్టుకోండి, మన గ్రామాన్ని బాగుచేయండని.. చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపుని స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు. 

 ఇంకో 50 ఏళ్లపాటు  ఈ ఇళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా. గ్యారెంటీగా ఉండేలా రెనవేషన్ చేయిస్తున్నామన్నారు మురళీ మోహాన్.  మా తరం అయిపోయేవరకు అయినా ఉండాలిగా అని బాగుచేయిస్తున్నాం. అయితే ఈ బిల్డింగ్ ను దేనికి ఉపయోగించాలి అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకులేదు.  ఈ పనులు పూర్తైన తర్వాత ఏం చేయాలి అనే విషయంపై ఆలోచిస్తామన్నారు. ఆ విషయంలో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఒక స్పష్టత వచ్చిన తర్వాత వెల్లడిస్తాను అన్నారు. అంతే కాదు నేను  ఏ నిర్ణయం తీసుకున్నా అది చాపర్రు జనాలకు ఉపయోగపడేలా ఉంటుంది అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios