Actor Mouli Tanuj: యంగ్ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్ మీడియా ముందు రెచ్చిపోయారు. బహిరంగంగా తన హేటర్స్ కు ఇచ్చిపడేశారు. ట్రోల్స్ తన గెలుపు ఆపలేవని అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు.  

Actor Mouli Tanuj: యంగ్ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్ రెచ్చిపోయారు. బహిరంగంగా తన హేటర్స్ కు ఇచ్చిపడేశారు. ట్రోల్స్ తన గెలుపు ఆపలేవని, ఏదోక రోజు వారు కూడా తన ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి వచ్చేట్టు చేస్తాననీ, మీ అందర్నీ నవ్విస్తా అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది? అంతగా రెచ్చిపోవడానికి కారణమేంటీ? ఓ మీరు కూడా ఓ లూక్కేయండి.

యంగ్ హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానున్నది. ఈ సినిమాలో శివానీ నాగారం హీరోయిన్‌గా నటించింది. యూత్‌ను ఆకట్టుకునే లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సారి మౌళి ఖాతాలో హిట్ పడుతుందని మూవీ మేకర్స్ కూడా భావిస్తున్నారు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే హీరో మౌళిపై వచ్చిన నెగటివ్ కామెంట్స్ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారాయి. గతంలో వైసీపీ పార్టీపై చేసిన ట్రోల్స్, ఆర్సీబీ ఫ్యాన్స్‌పై పెట్టిన వీడియోల కారణంగా, కొన్ని సోషల్ మీడియా కొంత మంది మౌళి సినిమాను బాయ్‌కాట్ చేయాలని ప్రేరేపిస్తున్నారు.

ఈ సమస్యపై హీరో మౌళి స్పందిస్తూ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. “నేను ఈ విషయంపై ఎంత మాట్లాడొద్దన్నా కూడా ఆగడం లేదు. ఈ విషయం మాట్లాడాలి. సోషల్ మీడియాలో కొన్ని బ్యాచులు ఉన్నాయి. వాళ్లంతా నా సినిమాని బాయ్ కాట్ చేయండి అని కామెంట్స్ చేస్తున్నాయి. అందులో చాలా మంది నెగిటివ్ కామెంట్లే పెడతారు. కానీ, సినిమా గురించి మాట్లాడరు. నాపైనే నెగిటివ్ కామెంట్లు పెడతారు. ఎందుకు ఇవన్నీ అంటే.. అప్పుడు నువ్వు ఓ పార్టీపై జోక్‌లు వేశావ్.. ఆర్సీబీని ఏదో అన్నావ్ అని అంటారు. నిజాని నాపై హేట్ కామెంట్స్ చేసేవారు ఆ పార్టీకి సంబంధం ఉన్నవారు కాదు. ఆ పార్టీ వాళ్లు కూడా నాకు సపోర్ట్ చేస్తారు’అని ఫీల్ అయ్యారు.

అంతే కాకుండా.. ‘నేను ఎదుగుతున్నానంటే కిందకి లాగేద్దాం అని చూసేవాళ్లకి కానీ.. నేనంటే ఇష్టం లేని వాళ్లకి కానీ.. ఒకటే చెప్తున్నా.. సెప్టెంబర్ 5న నా లిటిల్ హార్ట్స్ సినిమాకు రావొద్దు. వస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతా. మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి వచ్చేట్టు చేస్తా. మీ అందర్నీ నవ్విస్తే.. మీ అందర్నీ గెలిచేస్తా. ఇదే నా వార్నింగ్.” అంటూ మౌళి తన హేటర్స్‌పై సున్నితమైన, కానీ సూటిగా వార్నింగ్ ఇచ్చాడు. అతను స్పష్టంగా చెప్పాడు,

సోషల్ మీడియాలో పోస్టుల ఎఫెక్ట్..

నటుడు మౌళి గతంలో వైసీపీపై చేసిన జోక్స్, ఏపీ రాజధాని మూడు కేంద్రాల అంశాలను హేళన చేసిన వీడియోల కారణంగా సోషల్ మీడియాలో కొన్ని బ్యాచులు ఆయన సినిమాలను బాయ్‌కాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, అదే సమయంలో ఆయనకు సపోర్ట్ కూడా ఉంది. మౌళి మీడియాకు పేర్కొన్నారు, ఈ నెగటివ్ బ్యాచ్ సపోర్ట్ పార్టీకి చెందదు, కానీ అవార్డు ప్రతికూలతతో వాళ్లు ఆయనను కిందకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.