Asianet News TeluguAsianet News Telugu

నా పేరు వాడేస్తున్నారంటున్న మోహన్ బాబు... అంతా భ్రమ అంటూ ట్రోల్స్!


నటుడు మోహన్ బాబు తన పేరు రాజకీయంగా వాడుకుంటున్నారంటూ లేఖ విడుదల చేశారు. అయితే మోహన్ బాబు లేఖను నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆ అవసరం ఎవరికీ లేదంటూ కౌంటర్లు వేస్తున్నారు. 
 

actor mohan babu releases a latter netizens trolling ksr
Author
First Published Feb 26, 2024, 12:16 PM IST | Last Updated Feb 26, 2024, 1:33 PM IST

నటుడు మోహన్ బాబు గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్దతు పలికారు. టీడీపీ ప్రభుత్వం తన విద్యాసంస్థకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు చెల్లించలేదని ధర్నాలు చేశాడు. అనంతరం వైసీపీ పార్టీ అధికారంలోకి రాగా...  ఆయనకు సముచిత స్థానం లభించలేదని ఆయన భావించారు. 

ప్రస్తుతం వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు. చెప్పాలంటే వైసీపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నారు. మోహన్ బాబు నటుడిగా కొనసాగుతున్నారు. తన కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. 

కాగా ఆయన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చర్చకు దారి తీసింది. కొందరు తన పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో... తన ప్రమేయం లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయంగా ఆయన పేరు వాడుకుంటున్నారట. ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిందట. దయచేసి ఆ పని చేయకండి. లేదంటే నేను తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారంటూ... లేఖలో పొందుపరిచారు. 

మోహన్ బాబు లేఖను నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీ పేరు మీ కొడుకులు కూడా వాడుకోవడం లేదు. ఇంకెవరు వాడుకుంటారు. మీకు మీరే ఊహించుకుంటున్నారా? కలలు కంటున్నారా? అని ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయంగా, సినిమా పరంగా ఫేడ్ అవుట్ అయిన మీ పేరు వాడుకునేది ఎవరని ట్రోల్ చేస్తున్నారు. మోహన్ బాబు పోస్ట్ వైరల్ అవుతుంది. 

కాగా మంచు ఫ్యామిలీలో విబేధాలు కొనసాగుతున్నాయి. విష్ణు-మనోజ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మంచు లక్ష్మి, మనోజ్ ఒకవైపు... మోహన్ బాబు, విష్ణు మరొకవైపు చేరారు. మనోజ్ రెండో వివాహం మంచు లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి విష్ణు హాజరు కాలేదు. అన్నదమ్ముల మధ్య గొడవలు కారణం ఏమిటో తెలియదు... 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios