`లియో` నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌.. హీరోయిన్ త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకి క్షమాపణలు చెప్పారు.

తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌.. హీరోయిన్‌ త్రిషపై చేసిన వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా సౌత్‌ చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. `లియో` సినిమాలో త్రిషని రేప్‌ చేసే సీన్‌ లేదని, అందుకు తాను బాధపడుతున్నట్టుగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతుంది. సినీ సెలబ్రిటీలు స్పందించి విమర్శలు గుప్పించారు. చిరంజీవి కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో దీనిపై మన్సూర్‌ అలీ ఖాన్‌ రియాక్ట్ అయ్యారు. 

తాజాగా ఆయన త్రిషకి క్షమాపణలు చెప్పారు. ఆయన త్రిషకి బహిరంగంగా సారీ చెప్పారు. తన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆయన పరోక్షంగా తన క్షమాపణలు తెలిపారు. `కళింగ యుద్దం ముగిసింది. నేను గెలిచాను. ఆమె వివాహానికి ఆశీర్వదించే అవకాశం తనకు లభిస్తుందని ఆశిస్తున్నాను అని ఆయన వెల్లడించారు. మరి దీనితో ఈ వివాదానికి పుల్‌ స్టాప్‌ పడుతుందా అనేది చూడాలి. 

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రేప్‌ సీన్ల గురించి నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ మాట్లాడుతూ, `లియో` చిత్రంలో రేప్‌ సీన్లు ఉంటాయని భావించానని, త్రిష హీరోయిన్‌ అన్నప్పుడు కచ్చితంగా రేప్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నట్టు చెప్పాడు. ఆమెని ఎత్తుకుని బెడ్‌పైకి తీసుకెళ్లే సీన్‌ ఉంటుందని ఊహించానని, కానీ అవేవీ లేవని తాను నిరాశ చెందినట్టుగా మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన కామెంట్లు గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. నటుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సినీ నటులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. చిరంజీవి కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకే తన సపోర్ట్ అని, ఆమెకి అండగా ఉంటానని, ఈ వ్యాఖ్యలు ఆమెకే కాదు, సాటి మహిళలను అవమానించడమే అవుతుందని ఆయన ట్వీట్‌ చేశారు. ఇక మన్సూర్‌ అలీ ఖాన్‌పై త్రిష సైతం ఘాటుగా స్పందించింది. భవిష్యత్‌లో ఆయనతో కలిసి నటించేది లేదని స్పష్టం చేసింది.