ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ వివాదం సమంతను వదిలేలా లేదు. రోజురోజుకు ఈ గొడవ పెద్దది అవుతుందే కానీ తగ్గడం లేదు. ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత రోల్ తమిళుల మనోభావాలు కించ పరిచేదిగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, ప్రజలు ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ప్రసారం నిలిపివేయాలని కోరుకుంటున్నారు. తమిళ సీనియర్ నటుడు దర్శకుడు భారతీ రాజా అమెజాన్ ప్రైమ్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. 

ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ప్రసారం ఆపకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కోలీవుడ్ కి చెందిన మరో సీనియర్ నటుడు, కమెడియన్ మనో బాల ఈ విషయంపై స్పందించారు. ఇలాంటి సిరీస్ లలో నటించే ముందే సమంత ఓసారి ఆలోచించుకోవాల్సింది అన్నారు. ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో నటించి సమంత తప్పుచేశారని ఆయన అన్నారు. తమిళుల మనోభావాలను కించపరిచే పాత్రలో నటించిన సమంత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 


వివాదాల సంగతి ఎలా ఉన్నా సమంత పాత్రకు ప్రసంశలు దక్కుతున్నాయి. లేడీ టెర్రరిస్ట్ గా డీగ్లామర్ రోల్ లో సమంత ఎరగదీశారన్న మాట వినిపిస్తుంది. అరంగేట్రంతోనే డిజిటల్ వరల్డ్ ని సమంత షేక్ చేశారని అంటున్నారు. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో సమంత బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ మాన్ సిరీస్ సక్సెస్ నేపథ్యంలో సమంతకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం అందుతుంది.